![]() |
![]() |

రాముడైనా, కృష్ణుడైనా తెలుగువారికి ముందుగా గుర్తుకొచ్చే పేరు నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao). తన అందం, అభినయంతో ఆ పురాణ పురుషుల పాత్రలకు ప్రాణం పోశారు ఎన్టీఆర్ (NTR). అందుకే ఎందరో తెలుగువారు రాముడు, కృష్ణుడి రూపంలో ఉన్న ఆయన ఫొటోలను ఇంట్లో పెట్టుకుంటారు. ఆ దేవుళ్ళ రూపంలో ఎన్టీఆర్ ని తప్ప మరొకరిని ఊహించుకోలేరు. ఎన్ని తరాలైనా రాముడు, కృష్ణుడు అంటే తెలుగువారికి ఎన్టీఆరే గుర్తుకొస్తారు అనడంలో సందేహం లేదు. అందుకే నేటి తరం కోసం ఏఐని ఉపయోగించి రాముని రూపంలో ఉన్న ఎన్టీఆర్ ఫొటోలను 4k క్వాలిటీతో రూపొందించడం జరిగింది. అందులో ఒకటి కలర్ ఫొటో కాగా, మరొకటి బ్లాక్ అండ్ వైట్. ఆ రెండు ఫొటోల్లో శ్రీరాముడిగా ఎన్టీఆర్ ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు "రాముడంటే రామారావు.. రామారావు అంటే రాముడు" అని కామెంట్లు పెడుతున్నారు.


![]() |
![]() |