![]() |
![]() |
.webp)
విశ్వక్ సేన్(vishwak sen)స్పీడ్ ఇప్పట్లో ఆగేలా లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వరుస పెట్టి సినిమాలు చేస్తు తన క్రేజ్ కి ఉన్న సత్తాని చాటి చెప్తున్నాడు. అంతే కాదు ఎంతో మంది హీరోలకి సవాలు కూడా విసురుతున్నాడు .ఇంతకీ ఆ సవాలు ఏంటో చూద్దాం.
2017 లో వచ్చిన వెళ్ళిపోమాకే దగ్గరనుంచి గ్యాప్ అనేదే లేకుండా విశ్వక్ వరుసగా సినిమాలు చేసుకుంటు వస్తున్నాడు. ఫలక్ నామాదాస్, హిట్, పాగల్, ఓరి దేవుడా, రీసెంట్ గా వచ్చిన గామి లాంటి హిట్ చిత్రాలు విశ్వక్ ఖాతాలో ఉన్నాయి.విశ్వక్ అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ లో మెకానిక్ రాకీ అనే మూవీ ఉంది. ప్రస్తుతం ఆ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇది సెట్స్ మీద ఉన్నప్పుడే లైలా అనే మూవీని అనౌన్స్ చేసి అందర్నీ ఆశ్చర్య పరిచాడు.పైగా ఈ మూవీలో ఒక అమ్మాయి గెటప్ లో కనిపించనున్నాడు. బహుశా లైలా అనేది తన పేరే కావచ్చు. ఇక ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై కూడా రీసెంట్ గా అప్డేట్ వచ్చింది. ఇందుకు సంబంధించి అధికారకంగా ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. పోస్టర్ ని బట్టి చూస్తే విశ్వక్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనబడుతున్నట్టుగా తెలుస్తోంది. విశ్వక్ కెరీర్ లో 13వ చిత్రంగా రానుంది.

ఇక ఇలా వరుస పెట్టి ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేస్తు తన లాంటి యువ హీరోలకి సవాలు విసురుతున్నటుగా ఉంది. శ్రీధర్ గంటా దర్శకుడు కాగా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఫిలిం ఫేర్ అవార్డుల్ని సాధించిన దసరా మూవీకి సుధాకర్ చెరుకూరి(sudhakar cherukuri)నే నిర్మాత. మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
![]() |
![]() |