![]() |
![]() |

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తాజాగా ఒక పెను విషాదం చోటు చేసుకుంది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక యువ దర్శకుడు అకాల మరణం చెందాడు. దీంతో పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
జి ఎస్ టి(gst)2021 లో నందు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందు, స్వాతి మందల్ లు హీరోయిన్లు కాగా జానకి రామ్(komari janakiram)దర్శకత్వం వహించాడు. నిన్న రాత్రి జానకి రామ్ ఆకస్మిక మరణం చెందారు. అనారోగ్య కారణాలు అనే వార్తలు వస్తున్నాయి. ఇక అప్పట్లో జానకి రామ్ ఒక పెద్ద సంచలనమే నమోదు చేసాడు. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన జి ఎస్ టి ఫస్ట్ కీ ని ఒక శ్మశాన వాటికలో రిలీజ్ చేసాడు. పైగా కాటికాపరి చేతుల మీదుగా రిలీజ్ చేసాడు.

ఇక జి ఎస్ టి అంటే గాడ్, సైతాన్, టెక్నాలజీ.. ప్రస్తుత ప్రపంచంలో భక్తి పేరుతో సైతాన్ పేరుతో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. టెక్నాలజీ లో అప్ డేట్ కాకపోవడం వల్లనే అలాంటివి జరుగుతున్నాయని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేదు. వాటన్నిటికీ సమాధానంగా జి ఎస్ టి తెరకెక్కింది.జానకి రామ్ పూర్తి పేరు కొమరి జానకి రామ్.
![]() |
![]() |