![]() |
![]() |
.webp)
సినిమా కోసమే పుట్టిన నటుల్లో జగపతిబాబు(jagapathi babu)కూడా ఒకరు. సిల్వర్ స్క్రీన్ మీద ఆయన నటిస్తుంటే ప్రేక్షకులు తన్మయత్వంతో అలాగే చూస్తుండిపోతారు. ప్రెజంట్ సోషల్ మీడియాలో ఉన్న ఇంటర్వ్యూ లని సైతం అంతే ఇదిగా చూస్తారు. ఇందుకు వాటి తాలూకు వ్యూస్ నే ఉదాహరణ.ఇక లేటెస్ట్ గా జగపతి బాబుకి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.
మాస్ మహారాజా రవితేజ(ravi teja)అప్ కమింగ్ మూవీ మిస్టర్ బచ్చన్(mister bachchan)హరీష్ శంకర్(harish shankar)దర్శకుడు.శరవేగంగా షూటింగ్ ని పూర్తి చేసుకొని అగస్ట్ 15 న విడుదలకి సిద్ధం అవుతుంది. జగపతి బాబు మెయిన్ విలన్ గా ఒక పవర్ ఫుల్ పాత్రని పోషిస్తున్నాడు. టీజర్ లో ఆ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అంతే కాకుండా మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడని కూడా అర్దమవుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవలసి వస్తుందంటే జగపతి బాబు కి మిస్టర్ బచ్చన్ లోని క్యారక్టర్ నచ్చి ముందుగా ఒప్పుకున్న రెమ్యునరేషన్ కంటే తగ్గించాడు.పైగా తగ్గించడం అంటే చిన్న మొత్తంలో కాదు భారీగానే తగ్గించాడు.

రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ షూటింగ్ చివరి రోజు, ఫ్రెండ్ షిప్ డే ఒకే సారి రావడంతో యూనిట్ ఒక ఫంక్షన్ లాంటిది చేసింది. అందులో ఈ విషయాన్నీ స్వయంగా హరీష్ శంకరే వెల్లడి చేసాడు. ఇక ఈ వార్తతో జగపతి బాబు చాలా ఇంటర్వూస్ లో క్యారక్టర్ నచ్చితే డబ్బు నథింగ్ అని చెప్పింది అక్షరాలా సత్యం అని అందరకి అర్ధమయ్యింది. మిస్టర్ బచ్చన్ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై టి జి విశ్వ ప్రసాద్ నిర్మించగా భాగ్యశ్రీ భోస్లే హీరోయిన్.
![]() |
![]() |