![]() |
![]() |

వందల కోట్ల రూపాయిలతో తెరకెక్కే పాన్ ఇండియా సినిమా పబ్లిసిటీ ఒక వైపు..మెగా బ్రదర్ నాగబాబు(nagababu)సినీ స్పీచ్ ఒక వైపు రెండిటిలో ఏది ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుంది అంటే నాగబాబు స్పీచ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతగా వైరల్ అవుతుంది నాగబాబు సినీ స్పీచ్. రీసెంట్ గా ఒక స్పీచ్ తో అదరగొట్టేసాడు. యాజ్ యూజవూల్ వైరల్ గా మారింది.
నాగబాబు కూతురు నీహారిక(niharika)నిర్మాతగా కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా తెరకెక్కింది.నూతన నటినటులు చేస్తుండగా యదు వంశీ దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. అగస్ట్ 9 న విడుదల అవుతుంది. రీసెంట్ గా ప్రీ రిలీజ్ కార్యక్రమం జరిగింది. నాగబాబు వన్ ఆఫ్ ది గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాట్లాడితే మాది మెగా ఫ్యామిలీ, వీళ్ళు తప్ప ఎవరు ఉండరు. అలాగే ఇంకొన్ని ఫ్యామిలీస్ తప్ప ఎవరు ఉండరు అని కొంత మంది పనికిమాలిన వెదవులు అంటూ ఉంటారు. వాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే మాకు మెగా ఫ్యామిలీ అనే ఫీలింగ్ లేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ మా అబ్బ సొత్తు, సామ్రాజ్యం కాదు. మా తాతది కూడా కాదు. అలాగే అక్కినేని(akkineni)నందమూరి(nandamuri)ఫ్యామిలీస్ సామ్రాజ్యం కూడా కాదు. అందరిదీ అని చెప్పుకొచ్చాడు.

అదే విధంగా టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీ రెడ్ కార్పెట్ వేస్తుంది. కమిటీ కుర్రోళ్ళు లో నటించిన అందరు కొత్త వాళ్ళు. భవిష్యత్తులో వాళ్ళు ఏ రేంజ్ కి వెళ్తారో ఎవరు చెప్పగలరు. ఇండస్ట్రీ లో టాలెంట్ ముఖ్యం అని చెప్పాడు. ఇక ఇదే స్పీచ్ లో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. కమిటీ కుర్రోళ్ళు మూవీ ఫినిషింగ్ లో మీకు ఒక నాయకుడు గుర్తుకొస్తాడు.ఆ నాయకుడు ఎలక్షన్స్ కి ముందు యుద్ధం కూడా చేసాడని చెప్పాడు. దీంతో నాగబాబు చెప్పింది పవన్ కళ్యాణ్ గురించి అని ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు.
![]() |
![]() |