![]() |
![]() |

విరాట్ కోహ్లీ(virat kohli)భార్య అనుష్క శర్మ(anushka sharma)ధోని(dhoni)భార్య సాక్షి(sakshi)ఇద్దరు కూడా సినీ పరిశ్రమకి చెందిన వాళ్లే. అనుష్క అయితే ఓకే గాని సాక్షి సినిమా పర్సన్ ఎలా అవుతుందని అనుకుంటున్నారేమో.తన భర్త ధోని తో కలిసి అనేక సినిమాలని సాక్షి నిర్మించింది. పైగా వాటి ప్రమోషన్స్ లో కూడా పాల్గొంది. సిన్సియర్ మూవీ లవర్స్ కి ఈ విషయం తెలుసు.ఇక తాజాగా సాక్షి పై అనుష్క శర్మ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు అవి చాలా మందిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో అనుష్క శర్మ మాట్లాడుతు సాక్షి నేను చిన్నప్పటినుంచి స్నేహితులం. సాక్షిది అస్సోమ్ లోని టిన్సు కియ. మాది యూపిలోని అయోధ్య. కానీ సాక్షి ఫాదర్ అండ్ మా ఫాదర్ ఉద్యోగాల రీత్యా అస్సోమ్ లోని మార్గ రీటాలో ఉండే వాళ్ళం. దాంతో అక్కడే ఉన్న సెయింట్ మేరీస్ స్కూల్లో ఇద్దరం కలిసి చదువుకున్నాం. నేను స్కూల్ కి వెళ్లిన మొదటి రోజే సాక్షి పక్కకి వెళ్లి కూర్చున్నా. మొదటి రోజే నాతో బాగా మాట్లాడింది.అందుకే ప్రతి రోజు తన పక్కనే కూర్చునే దాన్ని. హోమ్ వర్క్ లో ఎలాంటి డౌట్ వచ్చినా కూడా తననే అడిగేదాన్ని.అలా మా ఇద్దరి మధ్యన మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. దాంతో మా ఇద్దరి మథర్స్ కూడా మంచి స్నేహితులయ్యారని చెప్పుకొచ్చింది.

అదే విధంగా మా రెండు కుటుంబాలు తరచూ కలుసుకునేవని, ఆరో తరగతికి వచ్చాక మా నాన్నకి ట్రాన్స్ ఫర్ అవ్వడంతో సాక్షికి దూరంగా వచ్చానని చెప్పిన అనుష్క , ఆతర్వాత ఎవరి వృత్తిలో వాళ్ళు స్థిరపడ్డాక కలుసుకున్నామని చెప్పింది. సాక్షి గుర్తుకొచ్చిన ప్రతి సారి తనతో చిన్ననాడు దిగిన ఫోటో చూసి మురిసిపోతానని కూడా చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి. ఏది ఏమైనా క్రికెట్ రంగంలో లెజండ్స్ గా ఉన్న ధోని, విరాట్ ని ఇద్దరు చిన్ననాటి స్నేహితురాళ్ళు పెళ్లి చేసుకోవడం నిజంగా గ్రేట్.
![]() |
![]() |