Home

»

Latest News

ఆకాశంలో ఒక తార.. దుల్కర్ స్పీడ్ మామూలుగా లేదు!

Jul 28, 2024 5:38PM

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తెలుగులోనూ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే 'మహానటి', 'సీతారామం' సినిమాలతో ఆకట్టుకున్న దుల్కర్.. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'లక్కీ భాస్కర్' అనే తెలుగు సినిమా చేస్తున్నాడు. ఇది సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు మరో తెలుగు సినిమాని ప్రకటించాడు దుల్కర్.

పవన్ సాధినేని దర్శకత్వంలో దుల్కర్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి "ఆకాశంలో ఒక తార" అనే టైటిల్ పెట్టారు. గీత ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్ బాక్స్ మీడియా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నేడు(జూలై 28) దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. పోస్టర్ ని బట్టి మరో ఆసక్తికరమైన ఫీల్ గుడ్ మూవీ దుల్కర్ రాబోతున్నాడని అర్థమవుతోంది. ఈ చిత్రం తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com