![]() |
![]() |

తమిళ అగ్ర నటుల్లో ఒకరైన ధనుష్(dhanush)లేటెస్ట్ గా రాయన్(raayan)తో మంచి విజయాన్ని అందుకున్నాడు. పాన్ ఇండియా లెవల్లో విడుదల అవ్వగా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లు రాబట్టే దిశగా అడుగులేస్తోంది. తమిళనాడులో అయితే ఫస్ట్ డే సెకండ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా కూడా నిలిచింది. ఈ జోరులోనే ధనుష్ అప్ కమింగ్ ప్రాజక్ట్ కుబేర(dhanush) నుంచి ధనుష్ లుక్ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు అది ట్రెండింగ్ లో ఉంది.
ధనుష్, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున(akkineni nagarjuna)తో కలిసి కుబేర చేస్తున్న విషయం అందరకి తెలిసిందే. దీంతో అందరిలోను భారీ అంచనాలే ఉన్నాయి. పైగా ఇండియన్ సినిమా హిస్టరీ లోనే కుబేర ని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అని కూడా చెప్పవచ్చు. ఇక జులై 28 న ధనుష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా కుబేర నుంచి ధనుష్ లుక్ రిలీజ్ అయ్యింది. కంప్లీట్ బిచ్చగాడు టైప్ ఆఫ్ లుక్ లో ధనుష్ ఉన్నాడు.మాసిపోయిన బట్టలు, చిందరవందరగా ఉన్న జుట్టు తో ఉన్న ఆ పిక్ ఇప్పుడు ధనుష్ అభిమానులతో పాటు సినిమా మీద అంచనాలు పెంచేసింది. అదే విధంగా కెరీర్ మొదటి నుంచి కూడా ఎన్నో వైవిధ్యమైన పాత్రలని పోషిస్తు తన నటనతో మెస్మరైజ్ చేసే ధనుష్ , ఈ సారి కుబేర తో మరోసారి తన అభిమానులకి ప్రేక్షకులకి అదిరిపోయే ట్రీట్ ఇస్తున్నాడనే చెప్పుకోవాలి.

ఇక కొన్ని రోజుల క్రితం నాగార్జున లుక్ రిలీజ్ అయ్యింది. నాగ్ గెటప్ చూస్తుంటే బాగా రిచ్ పర్సన్ లాగా ఉన్నాడు. పైగా డబ్బు అంటే లెక్కలేని వాడిలా ఉన్నాడు. ఇప్పుడు ధనుష్ ఏమో నిలువ నీడ లేని వ్యక్తిగా ఉన్నాడు. దీంతో సినిమా కథ మీద అందరిలో ఆసక్తి కూడా మొదలయ్యింది. శేఖర్ కమ్ముల(sekhar kammula)దర్శకుడు కాగా శ్రీ వెంకటేశ్వర ఎల్‌ఎల్‌పి సినిమాస్ మరియు అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై సునీల్ నారంగ్, రామ్ మోహన్ రావు లు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రష్మిక(rashmika mandanna) హీరోయిన్ కావడం కూడా కుబేర కి ప్లస్ అయ్యింది. ధనుష్ డైరెక్ట్ గా చేస్తున్న ఫస్ట్ తెలుగు మూవీ కూడా కుబేర నే.
![]() |
![]() |