![]() |
![]() |

తెలుగు ప్రేక్షకులు తమ హీరోలని ఎంతగా అభిమానిస్తారో, ఇతర భాషా హీరోలని కూడా అంతే ఇదిగా అభిమానిస్తారు. దాని ఖరీదు పాతిక కోట్లు. అభిమానాన్ని డబ్బులతో కొలవడం ఏంటి అని అనుకుంటున్నారా! అయితే పూర్తి డీటెయిల్స్ చూడండి.
ఇళయ దళపతి విజయ్(vijay)మూడున్నర దశాబ్దాల నుంచి తమిళ చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ హీరోగా తన సత్తా చాటుతు వస్తున్నాడు. కోట్లాది మంది అభిమానులు ఆయన సొంతం. ప్రస్తుతం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనే మూవీని చేస్తున్నాడు. సెప్టెంబర్ ఐదు న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతుంది. ఇప్పుడు ఈ మూవీ తమిళనాడు తో పాటు వరల్డ్ వైడ్ గా తమ బిజినెస్ ని లాక్ చేసుకునే పనిలో పడింది. మన తెలుగు నాట కూడా బిజినెస్ ని కంప్లీట్ చేసుకుందనే వార్తలు వస్తున్నాయి. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ గోట్ తెలుగు హక్కులని పొందింది. ఈ మేరకు పాతిక కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుందని అంటున్నారు. ఇప్పడు ఈ వార్త తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. విజయ్ గత చిత్రం లియో కూడా ఇంచు మించు ఇదే స్థాయి బిజినెస్ ని చేసుకుంది.

ఇక విజయ్ కొన్ని నెలల క్రితమే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తమిళ మున్నేట్ర కజగం అనే పేరుతో పార్టీని అనౌన్స్ చేసాడు. ఈ క్రమంలో వస్తున్న గోట్ మీద తమిళనాట నే కాకుండా తెలుగు నాట కూడా విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది. మహేష్ గుంటూరు కారంలో చేసిన మీనాక్షి చౌదరి(meenakshi chaudhary)హీరోయిన్ గా చేస్తుండగా ప్రభుదేవా, తొలిముద్దు ఫేమ్ ప్రశాంత్, జయరాం, స్నేహ, యోగి బాబు వంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. వెంకట్ ప్రభు(venkat prabhu)దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ 300 కోట్ల భారీ బడ్జట్ తో నిర్మిస్తుంది. విజయ్ ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే బయటకి వచ్చిన చిన్నపాటి టీజర్ తో అందరిలో అంచనాలు రెట్టింపు అయ్యాయి. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు.
![]() |
![]() |