![]() |
![]() |
.webp)
ఓటీటీలోనే కాదు కొన్ని సిరీస్ లు యూట్యూబ్ లోను థ్రిల్ ని పంచుతున్నాయి. అవే జాంబీ సిరీస్ లు.. కొన్ని ఓటీటీలో ఉండగా మరికొన్ని యూట్యూబ్ లో తెలుగులో అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి చూసేద్దాం.
మనకు తెలిసిన మొదటి జాంబీ సినిమా జాంబీ రెడ్డి.. తేజ సజ్జా నటించిన ఈ మూవీ కామెడీగా సాగిన జాంబీలుగా మనుషులు మారాక భయంకరంగా ఉంటుంది. ఆయితే ఈ సినిమాలో కామెడీగా ప్రాధాన్యత ఇవ్వడంతో అంత హర్రర్ ఏం అనిపించదు. జాంబి రెడ్డి ఫుల్ మూవీ యూట్యూబ్ లో ఉంది.
.webp)
ఊటిలోని ఓ కెమికల్ లాబొరేటరీ నుండి ఓ డేంజరెస్ పాయిజన్ లీక్ అవుతుంది. దానిని తిన్న ఓ కుక్క డేంజరస్ వైరస్ బారిన పడుతుంది. ఆ డేంజరెస్ కుక్క ఓ ఊరిలోకి చొరబడుతుంది. ఆ ఊరిలోని మనుషులని ఎలా నాశనం చేసింది. అక్కడ ట్రాఫిక్ పోలీస్ గా ఉండే కార్తిక్ వారిని ఆ వైరస్ నుండి కాపాడగలిగాడా లేదా అనేది తెలియాలంటే తమిళంలో 'విరుతన్' గా తెలుగులో 'యమపాశం' గా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఇది యూట్యూబ్ లో పార్ట్ పార్ట్ లుగా ఉంది.
.webp)
ఓ వైరస్ ఉన్న వ్యక్తి ఫ్లైట్ లోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుందంటు ' ఎమర్జెన్సీ డిక్లరేషన్' (Emergency Declaration) ని తీసారు మేకర్స్. హువాయి ప్రాంతానికి వెళ్తున్న కొంతమంది ప్యాసింజర్స్ మధ్యలోకి వైరస్ గల వ్యక్తి చొరబడతాడు. అప్పుడు ఫ్లైట్ లో ఉన్నవారికి ఏం జరిగింది. ఆ ఫ్లైట్ లో వైరస్ ఉందని ల్యాండ్ అయితే దేశం మొత్తం నాశనం అవుతుందని అక్కడి గవర్నమెంట్ ఎక్కడ ల్యాండ్ అవ్వకుండా చేస్తుంది. అలాంటి టైమ్ లో కిందనున్న డిటెక్టివ్ ఏం చేశాడు ఫ్లైట్ లో ఉన్న హీరో ఏం చేశాడో తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. థ్రిల్ ని పంచే సీన్లతో పాటు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని చూడాల్సిందే. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వర్షన్ ప్రైమ్ వీడియోలో ఉంది. యూట్యూబ్ లో ఉన్న ఇలాంటి థ్రిల్లర్స్ గురించి తెలియాలంటే కామెంట్ చేయండి.
![]() |
![]() |