![]() |
![]() |

మూడు దశాబ్దాల క్రితమే పాన్ ఇండియా నటిగా తన సత్తా చాటిన భామ మనీషా కొయిరాలా(manisha koirala)బొంబాయి, క్రిమినల్, ప్రేమతో వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. హిందీ చిత్ర సీమలో ఎన్నో హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. అగ్ర హీరోయిన్ హోదాని కూడా అనుభవించింది. లేటెస్ట్ గా తన జీవితంలో గతంలో జరిగిన కొన్ని విషయాల గురించి ప్రేక్షకులతో పంచుకుంది.
కెరీర్ ప్రారంభంలో ఫోటో షూట్ లు చేస్తామని కొంత మంది అడిగేవారు. ఆ క్రమంలో ఒక ఫోటోగ్రాఫర్ నా ఫొటోస్ ని తీసి ప్రశంసించేవాడు. భవిష్యత్తు లో నేను పెద్ద సూపర్ స్టార్ ని అవుతానని చెప్పేవాడు.ఒక రోజు టూ పీసెస్ డ్రెస్ తీసుకొచ్చి వేసుకోవాలని సూచించాడు. కానీ నేను నిరాకరించాను. కేవలం స్విమ్మింగ్ చేసే సమయంలోనే అలాంటి డ్రెస్ లు వేసుకుంటాను. అంతే కానీ సినిమాల్లో అవకాశాల కోసం ధరించనని చెప్పాను.దీంతో ఆ ఫోటోగ్రాఫర్ నన్ను తిట్టాడు. పైగా కరగడానికి నిరాకరించే మట్టి ముద్ద నుంచి ఎవరు బొమ్మని తయారు చెయ్యలేరని అన్నాడు. దాంతో అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవనే విషయం నాకు అర్ధమయ్యింది.
కానీ నేను మాత్రం ఆయన మాటలని మర్చిపోలేదు. మరింత కసిగా పని చేశా. నేను పెద్ద స్థాయికి వచ్చాక అతనే వచ్చి ఫోటోషూట్ చేసాడని చెప్పింది. ప్రస్తుతం ఆమె చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి. ఇక ఆమె తాజాగా హీరా మండి అనే వెబ్ సిరీస్ లో చేసింది. వేశ్య క్యారక్టర్ లో చాలా అద్భుతంగా నటించింది.ఇక 2012 లో అండాశయ క్యాన్సర్ కి గురయ్యి దాని నుంచి కోలుకుంది.
![]() |
![]() |