![]() |
![]() |

ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తీసుకున్న ఓ నిర్ణయం ఆయన అభిమానులతో పాటు అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప-2' సినిమా చేస్తున్న అల్లు అర్జున్.. ఆ తర్వాత త్రివిక్రమ్, అట్లీ, సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులతో సినిమాలు కమిటై ఉన్నాడు. అయితే వీటిలో అట్లీ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించకుండానే బన్నీ పక్కన పెట్టేయడం ఆశ్చర్యం కలిగించింది. అట్లీ రూ.80 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడని, అందుకే ఈ ప్రాజెక్ట్ అటకెక్కిందని ప్రచారం జరిగింది. కానీ బన్నీ ఈ ప్రాజెక్ట్ చేయకపోవడానికి వేరే రీజన్ ఉందట.
అల్లు అర్జున్ కోసం అట్లీ రెడీ చేసిన స్క్రిప్ట్ చాలా పవర్ ఫుల్ గా ఉందట. అయితే ఇందులో బన్నీతో పాటు మరో హీరోకి స్కోప్ ఉందట. ఆ పాత్ర బన్నీ రోల్ కి దాదాపు సమానంగా ఉందని తెలుస్తోంది. అందుకే మొదట స్టోరీ లైన్ విని, ఈ సినిమా చేయడానికి అల్లు అర్జున్ అంగీకరించినప్పటికీ.. ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అయ్యాక తన నిర్ణయాన్ని మార్చుకున్నాడట. పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది, ఇలాంటి సమయంలో మరో హీరోకి తన సినిమాలో స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఇవ్వడం కరెక్ట్ కాదని బన్నీ భావించాడట. అందుకే అట్లీ ప్రాజెక్ట్ ను సున్నితంగా రిజెక్ట్ చేశాడని సమాచారం.
![]() |
![]() |