![]() |
![]() |

నాగబాబు(naga babu)మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)సోదరుడుగా సినీ రంగ ప్రవేశం చేసి హీరోగా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, నిర్మతగా తెలుగు సినిమాకి ఎంతగానో సేవ చేస్తు వస్తున్నాడు. ఒకానొక సందర్భంలో నా అభిమాన నటుడు నాగబాబు అని స్వయంగా చిరంజీవి నే చెప్పాడు. దాన్ని బట్టి నాగబాబు స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
మొన్న జరిగిన ఏ పి ఎలక్షన్స్ లో నాగబాబు సోదరుడు పవన్ కళ్యాణ్ (pawan kalyan)అత్యధిక మెజారిటీ తో గెలిచాడు.దీంతో కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్య మంత్రితో పాటు మంత్రి గా కూడా బాధ్యతలని చేపట్టాడు. పైగా ఈ రోజు ఏంఎల్ఏ గా ఏపి ప్రజల దేవాలయం అసెంబ్లీ లో ప్రమాణ స్వీకారం చేసాడు. ఈ దృశ్యాన్ని చూడటానికి నాగబాబు కూడా అసెంబ్లీ కి వెళ్ళాడు. గ్యాలరీ లో కూర్చొని పవన్ ప్రమాణ స్వీకారాన్ని చూసీ మురిసిపోయాడు. ఇప్పుడు ఆ పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నాగబాబు వెంట ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కూడా ఉన్నాడు. నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీలో జనరల్ సెక్రటరీ గా బాధ్యతలని నిర్వహిస్తున్నాడు.

![]() |
![]() |