![]() |
![]() |
.webp)
గంగోత్రి తో సినీ రంగ ప్రవేశం చేసి తనదైన నటనతో డాన్సులతో, ఫైట్స్ తో ఐకాన్ స్టార్ గా ఎదిగిన హీరో అల్లు అర్జున్ (allu arjun)అందుకే అభిమానులు కాస్తా ఆర్మీ గా మారారు. బన్నీ, ఆర్య, దేశ ముదురు, జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడు,అలవైకుంఠ పురం, పుష్ప లాంటి భారీ హిట్స్ బన్నీ ఖాతాలో ఉన్నాయి. లేటెస్ట్ గా ఆయనకి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్( varalakshmi sarathkumar)తన చిరకాల స్నేహితుడైన నీకొలాయ్ సచ్ దేవ్ (Nicholai Sachdev)తో పెళ్లి చేసుకోబోతున్న విషయం అందరకి తెలిసిందే. ఈ మేరకు తమ పెళ్ళికి రావాలంటూ నికొలాయ్ తో పాటు బన్నీ ని కలిసి పెళ్లి కార్డు ఇచ్చింది. బన్నీ కూడా ఆ ఇద్దరిని సాదరంగా ఆహ్వానించాడు.పెళ్ళికి వస్తానని మాట కూడా ఇచ్చాడు. అరవింద్ కి కూడా పెళ్లి కార్డు ఇచ్చి పెళ్లి రావాలని ఇద్దరు కోరారు.ఆ ఇద్దరి వివాహం జులై 2 న థాయిలాండ్ లో జరగనుంది.
.webp)
ఇక చాలా రోజుల తర్వాత బన్నీ రియల్ పిక్స్ ని చూసిన ఫాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. ఎప్పుడు షూటింగ్స్ తో బిజీగా ఉండే బన్నీ రిలాక్స్ కోసం అప్పుడప్పుడు ఫంక్షన్స్ కి వెళ్తుండాలని కోరుతు సోషల్ మీడియాలో మెసేజ్ లు చేస్తున్నారు. బన్నీ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. తొలుత అగస్ట్ 15 న రిలీజ్ అని ప్రకటించారు. కానీ ఇప్పుడు డిసెంబర్ 6 న విడుదల కాబోతుంది.
![]() |
![]() |