![]() |
![]() |
.webp)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (ram charan) హీరోగా వచ్చిన మూవీ ఎవడు ద్వారా పరిచయమైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(jani master)అందులోని ఫ్రీడమ్ సాంగ్ కి అధ్బుతమైన నృత్య రీతులని సమకూర్చి ఎంతో మంది అగ్ర హీరోలకి వాంటెడ్ డాన్స్ మాస్టర్ గా మారాడు. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో మొన్న జరిగిన ఎలక్షన్స్ కి ముందు జనసేన పార్టీలో చేరి పార్టీ విజయానికి ప్రచారం చేసాడు. కొన్ని రోజుల క్రితం ఆయన మీద పోలీసు కేసు నమోదు అయ్యింది. ఇప్పుడు ఇది ఏకంగా పవన్ కళ్యాణ్ దగ్గరకి వెళ్ళింది.
జానీ మాస్టర్ ప్రస్తుతం తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కి అధ్యక్షుడు గా ఉన్నాడు. అందులో సతీష్ అనే డాన్సర్ మెంబర్ గా ఉన్నాడు. నాలుగు నెలల నుంచి జానీ మాస్టర్ తనని షూటింగ్స్ కి పిలవడంలేదని, తనకి వర్క్ చెప్పిన కో ఆర్డినేటర్స్ ని సైతం బెదిరిస్తున్నాడని, దాంతో ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తు హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి పరిధి రాయదుర్గం పిఎస్ లో కేసు ఫైల్ చేసాడు. ఇప్పుడు ప్రజావాణి లో ఫిర్యాదు చేసాడు.ఏకంగా జానీ మాస్టర్ అరాచకాలు ఇవి అంటు ఏపి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (pawan kalyan)కు కొరియర్ ద్వారా ఫిర్యాదు చేసాడు.
.webp)
పవన్ స్పూర్తితో ప్రజలకి సేవ చెయ్యడానికే రాజకీయాల్లోకి వచ్చానని జానీ మాస్టర్ పలు సందర్భాల్లో చెప్పాడు. ఇటీవల పవన్ ఎన్నికల్లో గెలవడంతో పాటు ఉప ముఖ్యమంత్రిగా, మంత్రి గా పని చెయ్యబోతుండటంతో సంబరాలు కూడా చేసుకున్నాడు. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు జానీ మాస్టర్ కేసు విషయం లో ఏ విధంగా స్పందిస్తాడో అనే ఆసక్తి అందరిలో ఉంది.
![]() |
![]() |