![]() |
![]() |

ఆగస్టు 15న విడుదల కావాల్సిన 'పుష్ప-2' (Pushpa 2) చిత్రం డిసెంబర్ కి వాయిదా పడనుంది అంటూ ఇటీవల వార్తలు వినిపించాయి. ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా చిత్ర బృందం కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప-1' ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. "తగ్గేదేలే" అంటూ పుష్పరాజ్ గా బన్నీ చేసిన సందడికి ఇండియా షేక్ అయింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వస్తున్న 'పుష్ప-2' పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ కి, రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
.webp)
అయితే మొదట ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకవస్తున్నామని ప్రకటించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు మేకర్స్. షూటింగ్ పార్ట్‌తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాకపోవడం, క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, టెక్నికల్‌గా మరింత అత్యున్నత విలువలతో, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలనే ఉద్దేశంతో సినిమా విడుదల తేదిని మార్చినట్లు తెలిపారు మేకర్స్.
'పుష్ప-2' సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా మిరోస్లా క్యూబా బ్రోజెక్ వ్యవహరిస్తున్నాడు.
![]() |
![]() |