![]() |
![]() |

హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్మకం, వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పబ్స్ లో డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉందని గ్రహించిన పోలీసులు.. కొంతకాలంగా పబ్స్ పై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే తరచూ పబ్స్ కి వెళ్తున్న వారిని గుర్తించి.. తాజాగా 40 మందిని పరీక్షించారట. అందులో పబ్బుల్లో డీజేగా వ్యవహరించే సిద్ధార్థ్ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. డీజే సిద్ది బాయ్ పేరుతో ఇతను ఫేమస్ అని తెలుస్తోంది. ఇతనితో పాటు మరో వ్యక్తి కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందట.
ప్రస్తుతం డీజే సిద్ధార్థ్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఇతనికి టాలీవుడ్ కి చెందిన పలువురు యువ హీరోలతో సత్సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో డ్రగ్స్ కేసు టాలీవుడ్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఈ డీజే సిద్ధార్థ్ కారణంగా టాలీవుడ్ సెలెబ్రిటీల పేర్లు ఏమైనా బయటపడతాయా అనేది ఆసక్తికరంగా మారింది.
![]() |
![]() |