![]() |
![]() |

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్ లో రూపొందాల్సిన సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే. అట్లీ రూ.80 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని న్యూస్ వినిపించింది. అయితే, ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన కారణంగా ఈ వెయ్యి కోట్ల డైరెక్టర్ ని బన్నీ కాదనుకోగా.. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) మాత్రం ఏరికోరి అట్లీతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.
'రాజా రాణి', 'తేరి', 'మెర్సల్', 'బిగిల్' సినిమాలతో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అట్లీ.. గతేడాది 'జవాన్'తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి.. సంచలన విజయం సాధించింది. 'జవాన్' వంటి సంచలన విజయం తర్వాత.. 'పుష్ప'తో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ తో చేతులు కలిపాడు. అయితే ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన రాక ముందే అటకెక్కింది. అయినప్పటికీ అట్లీకి బాలీవుడ్ నుంచి అదిరిపోయే ఆఫర్ వచ్చింది. సల్మాన్ ఖాన్ తో యాక్షన్ ఫిల్మ్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. మరి షారుఖ్ ఖాన్ తో చేసిన 'జవాన్'తో వెయ్యి కోట్ల మార్క్ అందుకున్న అట్లీ.. ఇప్పుడు సల్మాన్ ఖాన్ తోనూ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి.
![]() |
![]() |