![]() |
![]() |

టాలీవుడ్ లో మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉంది. రవితేజ హీరోగా నటించిన 'షాక్' సినిమాతోనే హరీష్ శంకర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన 'మిరపకాయ్' సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో రవితేజ యాటిట్యూడ్ కి, కామెడీ టైమింగ్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు వీరి కలయికలో ముచ్చటగా మూడో సినిమా వస్తోంది. అదే 'మిస్టర్ బచ్చన్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా షో రీల్ విడుదలైంది.

'మిస్టర్ బచ్చన్' ఎలా ఉండబోతుందో తెలుపుతూ 'షో రీల్' పేరుతో నిమిషం నిడివిగల వీడియోను తాజాగా విడుదల చేశారు. రవితేజ మాస్ యాటిట్యూడ్, యాక్షన్ సన్నివేశాలతో షో రీల్ అదిరిపోయింది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన 'రైడ్' సినిమాకి రీమేక్ గా రూపొందుతోంది ఈ చిత్రం. ఇందులో ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్ గా రవితేజ కనిపించనున్నాడు. రవితేజతో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు పాత్రల లుక్స్ ఎలా ఉండబోతున్నాయో కూడా వీడియోలో రివీల్ చేశారు. మొత్తానికి ఈ షో రీల్ చూస్తుంటే.. రవితేజ-హరీష్ కాంబినేషన్ లో మరో హిట్ ఖాయమనిపిస్తోంది.
![]() |
![]() |