![]() |
![]() |

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) 'దేవర' సినిమాతో బిజీగా ఉన్నాడు. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అక్టోబర్ 10న విడుదల కావాల్సిన ఈ సినిమా.. సెప్టెంబర్ 27 కి ప్రీ పోన్ అయింది. దీంతో షూటింగ్ మరింత వేగంగా పూర్తి చేయాల్సి ఉంది. ఇటీవల గోవాలో జరిగిన యాక్షన్ సీక్వెన్స్ షూట్ ని పూర్తి చేసుకొని హైదరాబాద్ కి వచ్చాడు ఎన్టీఆర్. నెక్స్ట్ షెడ్యూల్ లో పాల్గొనాల్సి ఉంది. ఇలాంటి టైంలో ఫ్యామిలీతో కలిసి ఎన్టీఆర్ థాయ్‌లాండ్ కి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. కొందరైతే 'దేవర' (Devara) షూట్ కి బ్రేక్ ఇచ్చి, ఫ్యామిలీతో ట్రిప్ కి వెళ్తున్నాడని భావిస్తున్నారు.
నిజానికి ఎన్టీఆర్ థాయ్‌లాండ్ కి వెళ్ళింది 'దేవర' షూట్ కోసమే. థాయ్‌లాండ్ లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ లపై ఒక రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరించనున్నారట. ఎలాగూ సాంగ్ షూట్ కోసం థాయ్‌లాండ్ కి వెళ్తున్నాడు కాబట్టి.. షూట్ గ్యాప్ లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్లు ఉంటుందని.. ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాడట ఎన్టీఆర్.
కుటుంబంలో కలిసి తాజాగా థాయ్‌లాండ్ కి వెళ్లిన ఎన్టీఆర్.. ఎయిర్ పోర్ట్ లో కెమెరా కంటికి చిక్కాడు. ఎన్టీఆర్ తో పాటు ఆయన భార్య లక్ష్మి ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఉన్నారు. ఎన్టీఆర్ చేయి పట్టుకొని భార్గవ్ రామ్ నడుస్తున్న ఫొటోలను.. "టైగర్ తో లిటిల్ టైగర్" అంటూ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
![]() |
![]() |