![]() |
![]() |
.webp)
ఓటీటీలో సస్పెన్స్ అండ్ హారర్ థ్రిల్లర్స్ కి ఉండే క్రేజే వేరు. కొన్ని సినిమాలు వెబ్ సిరీస్ లు అందరికి గుర్తుండిపోయేవిలా కొత్త దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తుంటారు. అలా కొత్త కాన్సెప్ట్ తో అమెజాన్ ప్రైమ్ లో ఉన్న ' ది స్ట్రేంజర్స్ ' మూవీ ఎలా ఉందో చూసేద్దాం.
బైలి మాడిసన్, లెవిస్ పుల్ మాన్, క్రిస్టియనా హెండ్రిక్స్, ఎమ్మా బెలోమి, మార్టిన్ హెండర్ సన్ ప్రధాన పాత్రలుగా నటించిన మూవీ ' ది స్ట్రేంజర్స్'. జోహన్నెస్ రాబర్ట్ ఈ మూవీ దర్శకుడు. బైలి మాడిసన్, లెవిస్ పుల్ మాన్, క్రిస్టియనా హెండ్రిక్స్, మార్టిన్ హెండర్ సన్ ఒకే కుటుంబానికి చెందినవారు. వీరంతా కలిసి విహారయాత్రకు వెళ్తారు. అక్కడికెళ్ళిన వీరికి అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. ఓ ముగ్గరు ముసుగు దుండగులు వారిని వెంబడిస్తారు. ఆ ముసుగు ధరించినవారెవరు? ఈ కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకున్నారు? ఆ నలుగురు ప్రాణాలతో తప్పించుకోగలిగారా తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.
తెలుగులో హారర్ అంటే భూతం, దెయ్యం, కాంచన, ముని లాంటి సినిమాలని చూసాం. కానీ ఈ హారర్ మూవీ వాటికి భిన్నంగా ఉంటుంది. సినిమా ప్రారంభంలోనే ముసుగు ధరించింది మనుషాలా? లేక దెయ్యాలా అనే క్యూరియాసిటిని కలిగించేలా చేశాడు దర్శకుడు. సినిమా అంతా ఆ ముసుగు ధరించిన వారి చుట్టూనే తిరుగుతుంది. ఈ ఫ్యామిలీ సర్వైవ్ అవుతారా లేదా అనే సస్పెన్స్ చూసే ప్రేక్షకులలో కలుగుతుంది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగుతుంది. మధ్యలో కొన్ని సీన్లు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ మూవీని చూసేయ్యండి.
![]() |
![]() |