![]() |
![]() |

విజయ్ దేవరకొండ (vijay devarakonda)అంటే కేవలం హీరో కాదు ఇట్స్ ఏ బ్రాండ్. కొంత కాలంగా పరాజయాలు వెంటాడుతున్నా కూడా క్రేజ్ మాత్రం కొంచమైనా తగ్గలేదు. గత నెలలో తన పుట్టిన రోజు సందర్భంగా కొన్ని క్రేజీ ప్రాజెక్టు లని అనౌన్స్ చేసాడు. అందుకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు. కానీ అంత బిజీలో కూడా అమెరికాలో ప్రత్యక్షమయ్యాడు.
విజయ్ దేవరకొండ రీసెంట్ గా అమెరికా వెళ్ళాడు. అక్కడ ఉన్న తెలుగు అసోసియేషన్ వారు నిర్వహించిన ఒక కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఎయిర్ పోర్ట్ లో దిగిన దగ్గరనుంచే విజయ్ తో ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు. ముఖ్యంగా యువత అయితే సెల్ఫీ లు దిగడం కోసం పోటీపడ్డారు. ఇక మీటింగ్ జరిగిన ప్రాంగణం మొత్తం అయితే విజయ్ నామ జపంతో ఊగిపోయింది. వాటి తాలూకు పిక్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కార్యక్రమానికి రావడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని విజయ్ తెలిపాడు.

గత చిత్రమైన ఫ్యామిలీ స్టార్ తో పరాజయాన్ని అందుకున్న విజయ్ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ప్రస్తుతం జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడు.యాక్షన్ థ్రిల్లర్ గా సాగే ఈ మూవీ మీద విజయ్ అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు.విజయ్ నుంచి నెక్స్ట్ వచ్చే మూవీ ఇదే. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. నెక్స్ట్ రవి కిరణ్ కోలా తో ఒక మూవీ, టాక్సీ వాలా, శ్యామ్ సింగరాయ్ దర్శకుడు రాహుల్ సంక్రుత్యన్ తో ఒక మూవీ చేస్తున్నాడు. ఈ రెండిటిని దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు నిర్మిస్తున్నాయి.
![]() |
![]() |