![]() |
![]() |
.webp)
మూవీ : స్టార్
నటీనటులు: కెవిన్, అదితి పోహంకర్, ప్రీతి, లాల్, కాదల్ సుకుమార్
ఎడిటింగ్: ప్రదీప్ రాఘవ్
సినిమాటోగ్రఫీ: అరసు
మ్యూజిక్: యువన్ శంకర్ రాజా
నిర్మాతలు: శ్రీనిధి సాగర్
దర్శకత్వం: ఎలన్
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
కథ:
తమిళనాడులోని ఓ ప్రాంతంలో కలైయరసన్ ( కెవిన్) ఉంటాడు. అతను అమ్మానాన్నలతో కలిసి ఉంటాడు. అతనికి పెళ్లి కావల్సిన చెల్లి ఉంటుంది. కలైయసరన్ కి చిన్నప్పటి నుండి సినిమాలంటే ఇష్టం .. గొప్ప నటుడు అవ్వాలనే చిన్నతనం నుండి కలలు కంటాడు. ఆ కలని నెరవేర్చువాలని ఎంతో శ్రమిస్తాడు. అతని తండ్రి కూడా సహాయం అందిస్తాడు. కలైయరసన్ మీరా( ప్రీతి) అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. తను కూడా కలైయరసన్ ని హీరో అవ్వాలని కోరుకుంటుంది. అయితే ఒకరోజు ముంబైలో కొత్త నటీనటుల కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని కలైయరసన్ తెలుసుకుంటాడు. ఇక అందుకోసం వాళ్ళ నాన్నని కలైయరసన్ డబ్బు అడుగగా.. కొంత డబ్బు ఇచ్చి అతనిని పంపిస్తాడు. అక్కడ తనతో పాటు చాలామంది ట్యాలెంట్ ఉన్న నటులని చూసిన కలైయరసన్ ఆలోచనలో పడతాడు. ఇక అది ముగించుకొని ఇంటికి వచ్చాక.. ఓ రోజు అతనికి యాక్సిడెంట్ అవవుతుంది. ఆ తర్వాత కొన్నిరోజులకి కలైయరసన్ కి మెలుకవ వస్తుంది. ఆ యాక్సిడెంట్ లో కలైయరసన్ మొహం మీద మచ్చ పడుతుంది. అది చూసి తను హీరో అవ్వాలనుకున్న కల నెరవేరదని నిరాశ చెందుతాడు. అదే సమయంలో మీరా తన ప్రేమని వద్దనుకొని వెళ్ళిపోతుంది. కలైయరసన్ స్టార్ అవ్వగలిగాడా? అతను ప్రేమించిన మీరా ఎందుకు వదిలి వెళ్లిపోయందనేది మిగతా కథ.
విశ్లేషణ:
సినిమాల్లో నటించడమంటే అంత ఈజీ కాదని ఈ సినిమా ద్వారా చెప్పాలనుకున్న దర్శకుడు ఎలన్.. సక్సెస్ అయ్యాడా అంటే కాదనే చెప్పాలి. కథా పాయింట్ చిన్నదే అయిన దానిని ఆడియన్స్ కి అర్థమయ్యేలా చెప్పడానికి చాలా ఎక్కువ సమయం తీసుకున్నాడు.
పాత్రలు తక్కువే.. బడ్జెట్ తక్కువే.. అలాగే ఎంటర్‌టైన్మెంట్ కూడా తక్కువే. ఓ సినిమాని చూడటానికి వచ్చే ఆడియన్ వినోదాన్ని కోరుకుంటాడు. ఈ సినిమాలో అదే లోపించింది. ఎంతసేపు అతని డ్రీమ్.. రాలేదని కృంగిపోవడం.. ఎవరు ఓదార్చిన హీరో మళ్ళీ మాములు వ్యక్తి కాలేకపోవడం ఇదే జరుగుతుంది. ఓ లక్ష్యం కోసం హీరో వెళ్తున్నాడని ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలోపే మళ్ళీ అతని వైఫల్యం .. దాన్నే తల్చుకొని మరింత బాధపడటం.. మళ్ళీ ఇదే సీన్ రిపీటెడ్ గా సాగుతుంది.
ఫస్టాఫ్ లో మూవీ ఒపెనింగ్ లో మీసం సీన్, కాయిన్ బాక్స్ దగ్గర రోజంతా ఎదురుచూసే సీన్, నాన్న మోటివేట్ ఇచ్చే సీన్ , సెకెండ్ లవ్ లో హీరోకి హీరోయిన్ సపోర్ట్ ఇచ్చే సీన్.. ఇవి సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. ద్వితీయార్థంలో కథ చాలా స్లోగా సాగుతుంది. ఎంతకి ఓ కొలిక్కి రాదు. ఇంకెప్పుడు క్లైమాక్స్ అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా అంతగా కనెక్ట్ అవ్వదు. తెలుగు డబ్బింగ్ బాగుంది కానీ తెలుగులోకి అనువదింవిన పాటలు ఏం బాలేవు. కొన్ని చోట్ల బిజిఎమ్ బాగుంది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఆకట్టుకుంది. అరసు సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి .
నటీనటుల పనితీరు:
కెవిన్ ఒదిగిపోయాడు. మీరా పాత్రలో ప్రీతి ఆకట్టుకుంది. మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా: లెంతీ మూవీ.. బట్ ఫస్టాఫ్ లోని కొన్ని సీన్లకి ఓసారి చూసేయొచ్చు.
రేటింగ్ : 2. 25 / 5
✍️. దాసరి మల్లేశ్
![]() |
![]() |