![]() |
![]() |

యుగపురుషుడు నందమూరి తారక రామారావు(NTR) కుటుంబం నుంచి అదే పేరుతో జూనియర్ ఎన్టీఆర్ వచ్చి స్టార్ గా ఎదిగాడు. అయితే ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి మరో ఎన్టీఆర్ వస్తుండటం ఆసక్తికరంగా మారింది.
హరికృష్ణకు ముగ్గురు కొడుకులు కాగా.. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా రాణిస్తున్నారు. పెద్ద కొడుకు జానకిరామ్ మాత్రం నిర్మాణానికే పరిమితమయ్యారు. 2014 లో రోడ్డు ప్రమాదానికి గురై ఆయన కన్నుమూశారు. అయితే ఇప్పుడు జానకిరామ్ పెద్ద కుమారుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అతని పేరు కూడా నందమూరి తారక రామారావు కావడం విశేషం.
నందమూరి ఫ్యామిలీ నుంచి వస్తున్న ఈ కొత్త ఎన్టీఆర్ సినిమాకి వై.వి.ఎస్. చౌదరి దర్శకుడు. న్యూ టాలెంట్ రోర్స్(NTR) బ్యానర్ పై యలమంచిలి గీత ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.

నందమూరి కుటుంబంతో వై.వి.ఎస్. చౌదరికి మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా హరికృష్ణతో మంచి బాండింగ్ ఉండేది. వీరి కలయికలో వచ్చిన 'సీతారామరాజు', 'లాహిరి లాహిరి లాహిరిలో', 'సీతయ్య' సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 2018 లో హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయితే హరికృష్ణ లేనప్పటికీ ఆయన మీద అభిమానంతో ఇప్పుడు జానకిరామ్ పెద్ద కొడుకుని హీరోగా పరిచయం చేసే బాధ్యత వై.వి.ఎస్. చౌదరి తీసుకున్నారు.
కాగా, చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ ఎన్టీఆర్ గా జానకిరామ్ తనయుడు ప్రేక్షకులకు పరిచయమే. 2015లో బాలల చిత్రంగా రూపొందిన 'దానవీరశూరకర్ణ'లో కృష్ణుడి పాత్ర పోషించాడు. ఎన్టీఆర్ బయోపిక్ లోనూ రామకృష్ణ పాత్రలో కనిపించాడు. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మరి ఈ ఎన్టీఆర్ కూడా స్టార్ గా ఎదుగుతాడేమో చూడాలి.
![]() |
![]() |