![]() |
![]() |

ఈ తరం హీరోలు ఇతర హీరోల సినిమాలలో ప్రత్యేక పాత్రలు పోషించడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. ఎందరో హీరోలు ఇతర హీరోల సినిమాలలో నటించి అలరిస్తున్నారు. తాజాగా 'లవ్ మౌళి' (Love Mouli) చిత్రంలో అఘోర పాత్రలో పాన్ ఇండియా హీరో మెరవడం ఆసక్తికరంగా మారింది.
కెరీర్ స్టార్టింగ్ నుంచే కథలు, పాత్రలు ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ.. తెలుగుతో పాటు హిందీలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రానా దగ్గుబాటి. ఇక 'బాహుబలి'లో భల్లాలదేవగా మెప్పించి.. పాన్ ఇండియా వైడ్ గా స్టార్డం తెచ్చుకున్నాడు. అయినప్పటికీ స్టార్డం అనే భ్రమలో పడిపోకుండా, కమర్షియల్ చట్రంలో చిక్కుకోకుండా.. విభిన్న పాత్రలు చేస్తున్నాడు రానా. హీరో, విలన్ తో పాటు స్పెషల్ రోల్స్ కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే 'లవ్ మౌళి'లో అఘోర పాత్ర చేశాడు. ఈ సినిమా జూన్ 7న విడుదల కానుండగా.. ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్లు పడ్డాయి. ప్రీమియర్లు చూసిన వారు.. ఇందులో రానా పాత్రని చూసి సర్‌ప్రైజ్ అయ్యామని చెబుతున్నారు. అఘోరాగా ఆయన మేకోవర్, స్క్రీన్ ప్రజెన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉందట. అసలు ఈ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా నిలిచిందని అంటున్నారు.
కొన్నేళ్లుగా ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలకు పరిమితం అవుతూ వస్తున్న నవదీప్.. తనని తాను హీరోగా రీ లాంచ్ చేసుకుంటున్నట్లుగా 'లవ్ మౌళి'ని ప్రమోట్ చేసుకున్నాడు. ఇండస్ట్రీలో నవదీప్ కి మంచి పరిచయాలు ఉన్నాయి. ప్రమోషన్స్ కోసం నాని వంటి వారిని కూడా రంగంలోకి దింపాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో అఘోరాగా రానా స్పెషల్ రోల్ లో మెరిసాడనే వార్త సర్‌ప్రైజింగ్ గా మారింది. రానా, నవదీప్ మంచి స్నేహితులు. ఆ అనుబంధంతోనే రానా ఈ పాత్ర చేసినట్లు తెలుస్తోంది. మరి రానా స్పెషల్ రోల్ నవదీప్ కి మంచి ఫలితాన్ని ఇస్తుందేమో చూడాలి.
![]() |
![]() |