![]() |
![]() |

ఎవరు ఆహా అన్నా.. ఎవరు ఓహో అన్నా.. మంచి పని చేస్తుంటే.. ఈ లోకంలోనా నువ్వే అసలు బంగారం అని పవన్ కళ్యాణ్ సినిమాలో మనమందరం ఇప్పటికే వినేసాం. అయితే ఇప్పుడు ఇదేందకు అంటే.. నిన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఓటింగ్ రిజల్ట్స్ లో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచాడు. అయితే ఈ హ్యాపీనెస్ ని ప్రతీ ఒక్క జనసేన అభిమానులు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందులో కొందరు ప్రముఖులు కూడా ఉన్నారు.
.webp)
సుప్రిత తన ఇంట్లో వాళ్ళ అమ్మ సురేఖవాణితో కలిసి డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియోని తన ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో కొండపల్లి నందగోపాల్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అతనెవరో ఎవరికీ తెలియదు. అయితే సురేఖవాణి, సుప్రిత చేసిన ఈ డ్యాన్స్ ఇప్పుడు వైరల్ గా మారింది. అంతలా ఏం ఉందంటే.. నీ పని నువ్వు సక్రమంగా, నీతీగా, నిజాయితీగా చేసుకుంటూ పోతే విజయం నిన్ను వరిస్తుంది. నువ్వు అసలు బంగారం అంటు వచ్చే లిరిక్స్ కి అదిరిపోయే స్టెప్పులతో అమ్మాకూతుళ్లు రెచ్చి పోయారు. ఇక ఇది ఒక్కసారిగా ఇన్ స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది.
టాలీవుడ్ నటి సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. తల్లీకూతుర్ల మాదిరి కాకుండా స్నేహితుల్లా ఉంటారు. సురేఖ తన కూతురితో కలిసి పబ్స్ కి కూడా వెళ్తుంటుంది. ఈ విషయాన్ని డైరెక్టుగా ఒప్పేసుకుంటుందామె. అయితే రెగ్యులర్ గా హాట్ ఫోటోలతో ట్రెండింగ్ లో ఉండే సుప్రిత.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి రాకముందే సుప్రిత సోషల్ మీడియాలో బాగా ఫేమస్. సుప్రితకి ఇన్ స్టాగ్రామ్ లో 859K ఫాలోవర్స్ ఉన్నారు. తల్లి సురేఖతో తరచూ రీల్స్, డ్యాన్స్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాదు తన గ్లామరస్ లుక్‌తోనూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
.webp)
![]() |
![]() |