![]() |
![]() |

ఆటల్లో ఎవరు గెలుస్తారు అనే కాకుండా.. ఎన్నికల్లోనూ ఏ పార్టీ గెలుస్తుంది అనే దానిపై బెట్టింగ్ వేయడం ఈమధ్య బాగా ట్రెండ్ అయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వారి స్థోమతకు తగ్గట్టుగా ఫలానా పార్టీ గెలుస్తుంది అంటూ బెట్టింగ్ లు వేస్తున్నారు. అలా బెట్టింగ్ వేసే.. టాలీవుడ్ కి చెందిన ఓ బడా నిర్మాత ఏకంగా రూ.5 కోట్లు పోగొట్టుకున్నాడట.
తాజాగా వెలువడిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 164 సీట్లు గెలవగా.. వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమై ప్రతిపక్ష హోదాని కూడా దక్కించుకోలేకపోయింది. వైసీపీ ఘోర పరాజయం చెందడం పట్ల ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎంత ఫీల్ అవుతున్నాడో తెలీదు కానీ.. ఒక ప్రముఖ ప్రొడ్యూసర్ మాత్రం తెగ ఫీలై పోతున్నాడట. ఏపీ ప్రజలు జగన్ రెండో ఛాన్స్ ఇస్తారని, వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అవుతాడని బలంగా నమ్మిన నిర్మాత.. ఏకంగా ఐదు కోట్లు బెట్టింగ్ వేశాడట. వైసీపీ దారుణ ఓటమితో పాటు.. ఇప్పుడు ఆ నిర్మాత ఐదు కోట్లు పోయాయట. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఇప్పుడు ఆ నిర్మాత "అనవసరంగా బెట్టింగ్ వేశాను.. ఆ డబ్బులతో ఒక చిన్న సినిమా తీసిన బాగుండేది." అని బాధపడుతున్నాడట. అందుకే పెద్దలు అంటారు.. "క్షవరం అయితే గాని వివరం రాదు" అని.
![]() |
![]() |