![]() |
![]() |
.webp)
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (rakul preet singh)ఇటీవలే కుమారి నుంచి శ్రీమతి గా మారింది. తన స్నేహితుడు, ప్రేమికుడు అయిన జాకీ భగ్నానీ ని వివాహం చేసుకొని ఒక ఇంటిదయ్యింది. దీంతో సినిమాల నుంచి కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటుందేమో అని అనుకున్నారు. కానీ వెంటనే కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటూ ఫుల్ బిజీగా మారింది. ఇప్పుడు ఆ సినిమా టాక్ అఫ్ ది డే గా మారింది.
దే దే ప్యార్ దే 2 ( de de pyaar de 2)...2019 లో వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ దే దే ప్యార్ దే మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతుంది. రకుల్ హీరోయిన్ గా చేస్తుంది. దీంతో ఈ వార్త సంచలనం గా మారింది.అందుకు కారణం కూడా లేకపోలేదు. దే దే ప్యార్ దే 2 లో తన కంటే చాలా పెద్ద వయసు కలిగిన ఒక నడి వయసు ఉన్న వ్యక్తి ప్రేమలో పడే యంగ్ లేడీ గా రకుల్ చేస్తుంది ఆ తర్వాత ఆ ఇద్దరి మధ్య ప్రయాణం ఎలా సాగింది అనేదే కథ.
మొదటి పార్ట్ కి దర్శకత్వం వహించిన అకీవ్ అలీకి బదులుగా అనుషూల్ శర్మ తెరకెక్కిస్తున్నాడు.భూషణ్ కుమార్, లవ్ రంజన్ లు సంయుక్తంగా నిర్మిస్తుండగా .యానిమల్ తో రీ ఎంట్రీ ఇచ్చిన అనిల్ కపూర్ ,మాధవన్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక పార్ట్ 1 లో వీర లెవల్లో విజృంభించిన టబు ఇప్పుడు పార్ట్ 2 లో కూడా చేస్తుందేమో చూడాలి. ప్రస్తుతం షూటింగ్ ముంబై లో జరుగుతుంది. రకుల్ నటించిన ఇండియన్ 2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |