![]() |
![]() |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ 'కల్కి 2898 AD' (Kalki 2898 AD). వైజయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ నిర్మిస్తున్న ఈ మూవీ జూన్ 27న విడుదల కానుంది. ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, బుజ్జి టీజర్, బుజ్జి అండ్ భైరవ సిరీస్ ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారైంది.
'కల్కి 2898 AD' ట్రైలర్ ను జూన్ 10న విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ కూడా ఆకట్టుకుంటే.. ఇక ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతాయి అనడంలో సందేహం లేదు. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే లెక్క వెయ్యి కోట్ల నుంచి మొదలవుతుంది. 'బాహుబలి-2' వసూళ్లను దాటినా ఆశ్చర్యంలేదు.

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్, ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరరావు వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |