![]() |
![]() |

తాజాగా జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అఖండ విజయం సాధించింది. దీంతో కూటమి నాయకులకు దేశవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) మౌనంగా ఉండటంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
కూటమి విజయం సాధించడంతో ఎందరో స్టార్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభినందనలు తెలియజేశారు. కానీ ఎన్టీఆర్ మాత్రం కనీసం ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. ఎన్నికలకు ముందు కూటమికి మద్దతుగా ఎటువంటి ట్వీట్ వేయని జూనియర్.. కనీసం ఫలితాల తర్వాతయినా శుభాకాంక్షలు తెలుపుతాడని భావించారంతా. కానీ ఎన్టీఆర్ మాత్రం ఎటువంటి ట్వీట్ వేయలేదు. దీంతో నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు.. "జూనియర్ కి ఏమైంది?" అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. తన మామ చంద్రబాబు, బాబాయ్ బాలకృష్ణ, బావ లోకేష్, అలాగే తన తోటి నటుడు పవన్ కళ్యాణ్ కి విషెస్ తెలిపితే ఎంత బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే మరి కొందరు మాత్రం.. "కొంతకాలంగా రాజకీయ పరమైన ట్వీట్స్ కి దూరంగా ఉంటున్న ఎన్టీఆర్.. వారికి వ్యక్తిగతంగా ఫోన్ ద్వారా అభినందనలు తెలిపి ఉంటాడు." అని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నికల ఫలితాల వేళ.. తారక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు.
![]() |
![]() |