![]() |
![]() |
.webp)
అక్కినేని నాగార్జున(akkineni nagarjuna)ఈ పేరు వింటే చాలు తెలుగు సినిమా మురిసిపోతుంది. మూడు దశాబ్దాల పై నుంచే కళకి సంబంధించి ఎన్ని పాత్రలు ఉంటాయో వాటన్నింటిలోను తన సత్తా చాటుతూ వస్తున్నాడు. లేటెస్ట్ గా ఆయన ఒక ట్వీట్ చేసాడు. ఇప్పుడు అది విత్ ఇన్ సెకన్స్ లోనే రికార్డు వ్యూస్ ని లైక్స్ ని సంపాదిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బిజెపీ నేతృత్వంలోని ఎన్ డి ఏ కూటమి విజయ బావుటా ఎగరవేసింది. భారతదేశం మొత్తం నివ్వెరపోయేలా రికార్డు విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 175 స్థానాలకి గాను 164 స్థానాల్లో ఘన విజయాన్ని సాధించింది. దీంతో నాగ్ ట్విట్టర్ వేదికగా కూటమికి ధన్యవాదాలు తెలుపుతు తన ప్రతి స్పందని తెలియచేసాడు. ఎన్ డి ఏ కూటమికి నా శుభాకాంక్షలు అంటూ మోడీ(modi)చంద్రబాబు నాయుడు(chandrababu naidu)పవన్ కళ్యాణ్ (pawan kalyan)పేరు లని ప్రస్తావించాడు.

ఇక ఎలక్షన్ల లకి ముందు జగన్ నేతృత్వంలోని వైసిపి కి నాగార్జున సపోర్ట్ చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి.దీంతో ఫ్యాన్స్ ఒక్క సారిగా షాక్ కి గురయ్యారు.ఎందుకంటే నాగ్ న్యూట్రల్ గా ఉండటానికి ఇష్టపడతాడు. ఇంత వరకు పలానా పార్టీ కి ఓటు వెయ్యమని చెప్పలేదు. ఆ తర్వాత వై సి పీ చేసిన రూమర్ అని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. వ్యక్తులతో పార్టీలతో సంబంధం లేకుండా మంచి చేసే వాళ్ళని అభినందించే మనస్తత్వం నాగ్ ది.
![]() |
![]() |