![]() |
![]() |
.webp)
మెగాహీరో వరుణ్ తేజ్ (varun tej) నటించిన వాల్మీకి అలియాస్ గద్దల కొండ గణేష్ లో వరుణ్ సినిమా హీరోగా కనిపిస్తాడు. అందులో ఒక సన్నివేశం ఉంటుంది. మనిషి చనిపోతే అందరు ఏడుస్తుంటారు.అప్పుడు అక్కడికి వరుణ్ తేజ్ వస్తాడు. దాంతో అందరు ఏడుపు ఆపి మీరు సినిమా హీరో కదు అని తెగ సంబరపడిపోతారు. సినిమా హీరోకి అంతటి శక్తీ ఉంది. కానీ ఇప్పుడు ఒక హీరో ఆ పరువు తీసే పనిలో ఉన్నాడు.
మార్గాన్ని భరత్( bharat margani)ఓయ్ నిన్నే(oye ninne)సినిమాతో హీరోగా తెరంగ్రేటం చేసాడు. మొదటి సినిమాతోనే మంచి నటుడు అనే గుర్తింపుని పొందాడు. ఈజీ నటనతో తెలుగు సినిమాకి ఒక ఫ్రెష్ నెస్ తో కూడుకున్న హీరో దొరికాడని అందరు అనుకున్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు గాని హఠాత్తుగా సినిమాల నుంచి మాయం అయ్యాడు. ఇక అసలు విషయానికి వస్తే భరత్ మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి వైసిపీ ఎంపి అభ్యర్థిగా పోటీ చేసాడు. ప్రస్తుత పరిస్థితులని చూస్తుంటే ఓడిపోయేలా ఉన్నాడు. తెలుగుదేశం, జనసేన, బలపరిచిన బిజెపి అభ్యర్థి పురందేశ్వరి విజయపదాన దూసుకుపోతుంది
దీంతో సినిమా హీరో పరువు పోయినట్టయ్యింది.ఎందుకంటే హీరోకి రాజకీయ పదవి దొరకటం చాలా కష్టం. అలాంటిది ఒకసారి గెలిచిన తర్వాత నిజ జీవితంలో హీరోలా పని చేసి మళ్ళీ గెలవాల్సింది పోయి ఓటమి అంచున నిలబడ్డాడు. గత ఎన్నికల్లో అదే రాజమండ్రి సెగ్మెంట్ నుంచి వైసిపీ తరుపున ఎంపి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు.
![]() |
![]() |