![]() |
![]() |

కౌంటింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యే కొద్దీ అందరి అభ్యర్థుల్లో టెన్షన్ మొదలయ్యింది. అంతకు మించిన టెన్షన్ నందమూరి నట సింహం బాలకృష్ణ (balakrishna)అభిమానుల్లో కూడా ఉంది. కానీ బాలకృష్ణ మాత్రం ఎందుకు టెన్షన్ అని అంటున్నాడు.
బాలకృష్ణ ప్రస్తుత ఎన్నికల్లో హిందూపురం నుంచి పోటీ చేస్తున్నాడు. గత రెండు పర్యాయాలు ఇదే సెగ్మెంట్ నుంచి ఘన విజయాన్ని సాధించాడు. హ్యాట్రిక్ ఖాయమనే ప్రచారం జరుగుతుంది. ఎలక్షన్స్ లో పోటీ చేసే అభ్యర్థులు సాధారణంగా ఉదయాన్నే కౌంటింగ్ కేంద్రం దగ్గరకి వెళ్ళరు. ఒక వేళ వెళ్లినా పూర్తి మెజారిటీ వచ్చాక వెళ్తారు. కానీ బాలయ్య మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా ఉదయమే కౌంటింగ్ సెంటర్ కి వెళ్లి అభిమానులని ఆనందంలో ముంచెత్తాడు. ఎలాంటి టెన్షన్ పడద్దు గెలుపు మనదే అనే భరోసా ని ఇచ్చారు. సోషల్ మీడియాలోఆ వీడియో వైరల్ అవుతుంది.
2014 లో హిందూపురం లో అడుగుపెట్టిన బాలకృష్ణ ఆ ఎన్నికల్లో పదహారు వేల నూట తొంబై ఆరు ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు. 2019 లో పద్దినిమిది వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచాడు. హాట్రిక్ పక్కా.. మెజారిటీ పెరగడం పక్కా అని అంటున్నారు.
![]() |
![]() |