![]() |
![]() |
.webp)
భారతీయ సినీ పరిశ్రమలో తెలుగు సినీ పరిశ్రమకి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ హీరోలని విపరీతంగా అభిమానించే ఫ్యాన్స్ ఉంటారు. అదే విధంగా అందరి హీరోల అభిమానులు కలిసి అభిమానించే హీరో కూడా ఉంటాడు. అలాంటి హీరోల్లో ఒకడు పవన్ కళ్యాణ్(pawan kalyan)ఇప్పుడు ఆయన అభిమానులకి గుడ్ న్యూస్.
మొన్న జరిగిన ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి జనసేన పార్టీ తరుపున పోటీ చేసాడు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోవడంతో ఈ సారి ఫలితం ఎలా ఉంటుందనే టెన్షన్ అభిమానుల్లో మొదలయ్యింది. లేటెస్ట్ గా వాళ్ళకి ఒక తీపి కబురు వచ్చింది. మొత్తం నాలుగు రౌండ్ లు పూర్తయ్యే సరికి ఇరవై రెండు వేల మెజారిటీ తో పవన్ దూసుకుపోతున్నాడు. నాలుగు రౌండ్లకే అంత మెజారిటీ ఉంటే చివరకి లక్షన్నర మెజారిటీ దాటవచ్చనే మాటలు వినపడుతున్నాయి.
పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు(chandrababu naidu)నేతృత్వంలోని టీడీపీ తో కలిసి ఎన్నికల కదన రంగంలోకి దిగాడు.ఈ సందర్భంగా ప్రతి పక్షమైన వైసీపీ పవన్ ని దత్త పుత్రుడు అని విమర్శించింది. ఇప్పుడు అది నిజమయ్యింది. ఎందుకంటే పిఠాపురం దత్తాత్రేయుడు కొలువు తీరిన పుణ్య క్షేత్రం.. విచిత్రం ఏంటంటే పిఠాపురం సెగ్మెంట్ ని పవన్ ఎంచుకోక ముందు నుంచే దత్త పుత్రుడు అని విమర్శించాయి. ఇప్పుడు అది నిజం కానుంది.
![]() |
![]() |