![]() |
![]() |
ఇటీవల ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన నందమూరి బాలకృష్ణ.. నటి అంజలితో అనుచితంగా ప్రవర్తించారని, ఫొటో సెషన్ సమయంలో అంజలిని వెనక్కి నెట్టేశారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. ఈ వేదికపై బాలయ్య ప్రవర్తనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ విషయమై అంజలి ఎక్స్‌లో స్పందించారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఈవెంట్‌కు బాలకృష్ణగారు వచ్చినందుకు చాలా థాంక్స్. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. మేమిద్దరం పరస్పరం గౌరవించుకుంటాం. ఆయనతో వేదిక పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది’’ అని పోస్టు పెట్టారు. అదే వేడుకలో బాలయ్యకు, తనకు మధ్య జరిగిన కొన్ని హ్యాపీ మూమెంట్స్‌కు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు.
ఈ ఈవెంట్‌లో అంజలితో బాలకృష్ణ దురుసుగా ప్రవర్తించారంటూ ప్రచారంలో ఉన్న వీడియోపై, ఆయనపై వస్తున్న విమర్శలపై నిర్మాత నాగవంశీ స్పందించారు. ఫోటోలు తీస్తున్న సమయంలో చనువుకొద్దీ వెనక్కి తోశారు తప్ప ఆయన ప్రవర్తలో మరే ఉద్దేశం లేదు. ఫ్రెండ్‌షిప్‌లో ఇలాంటివి ఎంతో సహజమన్నారు. అంతేకాదు అంజలిని వెనక్కి నెట్టిన వీడియోనే ప్రత్యేకించి చూపిస్తున్నారు తప్ప దానికి ముందు, వెనుక ఉన్న విజువల్స్‌ని ఎందుకు చూపించడం లేదు. ఇలా ఒక చిన్న బిట్‌ని చూపిస్తూ దుష్ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ఆ తర్వాత బాలయ్య, అంజలి హైఫై అంటూ చప్పట్లు కొడుతున్న దృశ్యాన్ని ఎవరూ చూపించడం లేదు. అది కూడా చూపిస్తే అక్కడ జరిగిన విషయం ఎంత చిన్నది అనే విషయం అందరికీ అర్థమవుతుంది అంటూ వివరించారు.
![]() |
![]() |