![]() |
![]() |
మిలియన్ స్టూడియో బ్యానర్ మీద ఎం.ఎస్.మన్జూర్ సమర్పణలో గుహన్ సెన్నియప్పన్ తెరకెక్కించిన చిత్రం ‘వెపన్’. ఈ చిత్రంలో సత్యరాజ్, వసంత్ రవి, తాన్యా హోప్ ప్రముఖ పాత్రలను పోషించారు. ఈ మూవీ జూన్ 7న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గురువారంనాడు హైద్రాబాద్‌లో నిర్వహించారు.
సత్యరాజ్ మాట్లాడుతూ.. ‘పెన్, మైక్, మీడియా అనేది రియల్ వెపన్. ఓటు అనేది మరో గొప్ప వెపన్. తాన్యా హోప్ ఆంగ్లో ఇండియన్. కానీ తెలుగులో చక్కగా మాట్లాడారు. నేను ‘అందరికీ నమస్కారం’ మాత్రమే చెబుతున్నాను. ప్రస్తుతం భాష అనేది హద్దుగా లేదు. బాహుబలి సినిమా ఎన్నో భాషల్లోకి వెళ్లింది. ఈ వెపన్ మూవీ కూడా అలాంటి ఓ చిత్రమే. ఇది పెద్ద హిట్ కాబోతోంది. సూపర్ హ్యూమన్ సాగా కాన్సెప్ట్‌తో రాబోతోంది. ఇదొక కొత్త ట్రెండ్ కాబోతోంది. గుహన్ మంచి కథను రాసుకున్నారు. వసంత్ రవి జైలర్‌లో అద్బుతంగా నటించారు. యంగ్ టాలెంటెడ్ యాక్టర్లతో నటించడం ఆనందంగా ఉంటుంది. నిర్మాత మన్జూర్ ఈ మూవీకి ఎంతో ఖర్చు పెట్టారు. జూన్ 7న మా చిత్రం రాబోతోంది. కల్కి సినిమాకు మా చిత్రానికి మధ్యలో 20 రోజులున్నాయి. మా సినిమాను అందరూ చూసి ఎంకరేజ్ చేయండి’ అన్నారు.
వసంత్ రవి మాట్లాడుతూ.. ‘ఫ్యాంటసీ యాక్షన్, సూపర్ హీరో ఎలిమెంట్స్ అంటూ ఇలా ఇంట్రెస్టింగ్‌గా గుహన్‌గారు ఈ కథను రాశారు. కామిక్ స్టైల్లో ఈ మూవీని రాసుకున్నారు. అది చాలా గొప్పగా వచ్చింది’ అని అన్నారు. తాన్యా హోప్ మాట్లాడుతూ.. ‘వెపన్ మూవీ కోసం ఈ రోజు ఇక్కడ ఇలా వచ్చినందుకు ఆనందంగా ఉంది. సత్యరాజ్, వసంత రవి, రాజీవ్‌లతో పని చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. రాజీవ్ పిళ్లై మాట్లాడుతూ.. ‘ప్రతీ నటుడికి ఓ సూపర్ హీరో మూవీని చేయాలని ఉంటుంది. నాకు అలాంటి ఓ కారెక్టర్ దక్కింది. కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి ఓ మంచి కారెక్టర్ రావడం మామూలు విషయం కాదు. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అన్నారు.
గుహన్ సెన్నియప్పన్ మాట్లాడుతూ.. ‘ఇదొక సైఫై థ్రిల్లర్, యాక్షన్ మూవీ. ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా నిర్మించిన అబ్దుల్, మన్జూర్, అజిజ్ సర్‌కు థాంక్స్. సత్యరాజ్ గారు అద్భుతమైన పాత్రను పోషించారు. ఆయన ఒక లెజెండ్. ఆయనలోని కొత్త కోణాన్ని మీరు ఈ చిత్రంలో చూడబోతోన్నారు. ఈ పాత్రను ఆయన మాత్రమే పోషించగలరని నాకు తెలుసు. అందుకే ఈ పాత్రకు ఆయన్ను మాత్రమే ఊహించుకున్నాను. ఈ చిత్రాన్ని రెండో వరల్డ్ వార్‌ను బేస్ చేసుకుని రాసుకున్నాను. ఈ సినిమా కోసం కొన్ని చోట్ల ఏఐ టూల్స్ వాడాం. జూన్ 7 రాబోతోన్న ఈ యాక్షన్ ప్యాక్డ్ సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’ అన్నారు.
![]() |
![]() |