![]() |
![]() |
.webp)
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు (mahesh babu) బావ ప్రముఖ హీరో సుదీర్ బాబు(sudheer babu) పరిస్థితి. హీరోకి కావలసిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి .మంచి హైట్, ఫిజిక్, కలర్ ఇలా అన్ని ఉన్నాయి. పైగా మంచి పెర్ఫార్మర్ కూడా. కానీ ఎందుకో సరైన హిట్ పడలేదు. తన ఎంటైర్ కెరీర్ మొత్తంలో ప్రేమకధాచిత్రమ్ ఒక్కటే సూపర్ హిట్. దీంతో ఇప్పుడు సుధీర్ కి అర్జెంటు గా హిట్ కావాలి. తాజా పరిస్థితులని చూస్తుంటే హిట్ కాదు బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడు.
హరోంహర (harom hara)సుదీర్ బాబు అప్ కమింగ్ మూవీ .టైటిల్ లోనే ప్యూర్ పాజిటివ్ వైబ్రేషన్స్ ని నింపుకున్న ఈ మూవీ రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతుంది. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. బలవంతుడి కి ఆయుధం అవసరమైతే బలహీనుడుకి ఆయుధమే బలం అనే ఇంట్రెస్టింగ్ డైలాగ్ తో స్టార్ అయ్యింది. రెండు నిమిషాల ముప్పై ఆరు సెకన్లతో ఉన్న ట్రైలర్ ని చూస్తున్నంత సేపు కూడా సుధీర్ తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడని అర్ధం అవుతుంది.అదే విధంగా మూవీ పక్కా హిట్ అనే విధంగా చాలా డైలాగ్ లు చెప్తున్నాయి. కత్తి ఉంటే పొడిపిచ్చుకునే వాడు భయపడతాడు.అదే తుపాకీ ఉంటే అందరు భయపడతారు. చావు చూసినా చలించలేదంటే నువ్వు మంచోడివి అనేది అబద్దం.అసలు మంచి చెడు అనేదే అబద్దం.ఇలాంటి డైలాగ్స్ చాలానే ఉన్నాయి.ఆ పక్కన ఉండే వాడికి చెప్పు. ఈ పక్కన ఒకడున్నాడనే డైలాగ్ అయితే సుధీర్ బాబు అణగారినవర్గాల నుంచి వచ్చి అందర్నీ శాసించే స్థాయికి ఎదగబోతున్నాడని అనుకోవచ్చు.
.webp)
ఫైట్స్ కూడా ఒక రేంజ్ లో ఉండబోతున్నాయని తెలుస్తుంది. కుప్పం కి చెందిన వ్యక్తిగా సుధీర్ బాబు నటిస్తున్నాడు.బహుశా కుప్పం నేపథ్యంలో సినిమా రావడం ఇదే తొలిసారి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర క్రియేషన్స్ పతాకంపై సుమంత్ జి. నాయుడు నిర్మిస్తుండగా జ్ఞానసాగర్ ద్వారా దర్శకుడు. చైతన్య భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తుండగా మాళవిక శర్మ హీరోయిన్. ట్రైలర్ లో చూస్తుంటే నటనకి అవకాశం ఉన్న పాత్రనే ఆమె పోషిస్తుందనే విషయం ఆర్డమవుతుంది.నెక్స్ట్ మంత్ జూన్ 14 న రిలీజ్ కాబోతుంది.సుధీర్ బాబు మాస్ సంభవం పక్కా అనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. సునీల్ ,రవి కాలే , కేశవ్ దీపక్ లు కీలక పాత్రలని పోషిస్తున్నారు.కుప్పం అనగానే అందరకి చంద్రబాబు నాయుడు (chandrababu naidu) గుర్తుకొస్తారు.
![]() |
![]() |