![]() |
![]() |

ఈ భూమ్మీద ఉన్న అత్యంత అదృష్టవంతులు ఎవరంటే ఓటిటి సినీ ప్రేక్షకులు అని చెప్పుకోవచ్చు. ఎంచక్కా అన్ని భాషలకి చెందిన సినిమాలని థియేటర్స్ లోకి వచ్చిన తక్కువ వ్యవధిలోనే వీక్షిస్తున్నారు. పైగా డబుల్ బొనాంజాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా అలరించే లిస్ట్ లో ఉంటున్నాయి. రీసెంట్ గా మరో బ్లాక్ బస్టర్ మూవీ వాళ్ళని కనువిందు చెయ్యనుంది.
బడే మియా చోటే మియా(bade miyan chote miyan) బాలీవుడ్ అగ్ర హీరోలు అక్షయ్ కుమార్(akshay kumar) టైగర్ ష్రఫ్ (tiger shroff)లు కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఏప్రిల్ పది న థియేటర్స్ లోకి అడుగు పెట్టింది. దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కగా విడుదలైన అన్ని చోట్ల మంచి విజయాన్ని సాధించింది. 350 కోట్ల రూపాయిల బడ్జట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ వేదికగా జూన్ 6 న స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు సంస్థ అధికారకంగా కూడా ప్రకటించింది. ప్రత్యేకించి తెలుగు ప్రేక్షకులకి ఇది నయా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే బడే మియా చోటే మియా తెలుగు భాషలోను అందుబాటులోకి రానుంది.అంటే బడే మియా చోటా మియా తెలుగులో మాట్లాడబోతున్నారు.
ఇండియన్ ఆర్మీ లో పని చేసి మంచి గుర్తింపుని పొందిన బడేమియా చోటామియా ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల ఉద్యోగాన్ని కోల్పోతారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆర్మీ కి ఆ ఇద్దరి అవసరం ఏర్పడుతుంది. ఆ అవసరం ఏంటి ? అందుకు ఆ ఇద్దరు ఒప్పుకున్నారా? ఒప్పుకుంటే ఆ పనిని ఎలా గెలిచారు అనేదే కథ.మూవీ ఆద్యంతం బడే మియా చోటేమియా పోరాటాలు కనువిందు చేస్తాయి. మానుషీ చిల్లర్, అలయా ఎఫ్ హీరోయిన్ లు గా చేసారు. ఇమ్రాన్ హష్మీ విలన్ గా చెయ్యగా మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ ఒక ముఖ్య పాత్ర పోషించాడు.అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు. రకుల్ ప్రీత్ సింగ్ హస్బెండ్ జాకీ భగ్నానీ తో కలిసి అలీ అబ్బాస్ జాఫర్ నే నిర్మించాడు. జూన్ 6 న దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఓటిటి కి అతుక్కుపోవడం ఖాయం.
![]() |
![]() |