![]() |
![]() |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ 'కల్కి 2898 AD' (Kalki 2898 AD). వైజయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాల స్థాయిలో వరల్డ్ వైడ్ గా సత్తా చాటుతుందనే అంచనాలున్నాయి. ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన సర్ ప్రైజ్ మరింత కిక్ ఇస్తోంది.
'కల్కి 2898 AD' లో ప్రభాస్ భైరవగా కనిపించగా, అతని వాహనం బుజ్జి కూడా ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇప్పుడు ఈ రెండు పాత్రలను ప్రధానంగా చేసుకొని 'బుజ్జి అండ్ భైరవ' (Bujji & Bhairava) పేరుతో ఒక యానిమేటెడ్ సిరీస్ రాబోతుంది. నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ సిరీస్ మే 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా.. అది హాలీవుడ్ యానిమేటెడ్ సిరీస్ లను తలపించేలా ఉంది. ఇక ట్రైలర్ చివరిలో "ది కల్కి సినిమాటిక్ యూనివర్స్" అని వేయడం చూస్తుంటే.. ఒక సినిమాకో, ఒక సిరీస్ కో కల్కి పరిమితం కాదని.. మరిన్ని సినిమాలు, సిరీస్ లు వచ్చే అవకాశముంది అనిపిస్తోంది.

![]() |
![]() |