![]() |
![]() |

రణవీర్ సింగ్ (Ranveer Singh) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో 'రాక్షస' అనే సినిమాని రూపొందించడానికి మైత్రి మూవీ మేకర్స్ సన్నాహాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల ఈ సినిమా ఆగిపోయిందని ఇటీవల వార్తలొచ్చాయి. ముఖ్యంగా సినిమా విషయంలో రణవీర్ సింగ్, ప్రశాంత్ వర్మ మధ్య విభేదాలు వచ్చాయని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇచ్చింది.

ప్రస్తుతం 'రాక్షస' ప్రాజెక్ట్ లేదని, కానీ భవిష్యత్ లో ఖచ్చితంగా రణవీర్ సింగ్-ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని తెలుపుతూ మైత్రి ప్రెస్ నోట్ విడుదల చేసింది. అందులో రణవీర్, ప్రశాంత్ స్టేట్ మెంట్ లు కూడా ఉన్నాయి. "ప్రశాంత్ ఎంతో ప్రతిభావంతుడు. భవిష్యత్ లో తప్పకుండా మేమిద్దరం కలిసి పని చేస్తాం." అని రణవీర్ అన్నారు."రణవీర్ అరుదైన నటుడు. భవిష్యత్ తో ఆయనతో కలిసి సినిమా చేస్తాను." అని ప్రశాంత్ అన్నారు.
![]() |
![]() |