![]() |
![]() |

ప్రస్తుత సినీ మార్కెట్ లో అగ్ర హీరోల సినిమా ఏదీ లేదు. అయితేనేం ఇతర హీరోల సినిమా బాధ్యతని తమ భుజ స్కందాల పై వేసుకుంటు అభిమానుల టచ్ లోనే ఉంటు వస్తున్నారు. లేటెస్ట్ గా నందమూరి బాలకృష్ణ (balakrishna)యువ హీరో విశ్వక్ సేన్ (vishwak sen) ఫంక్షన్ కి హాజరయ్యి తన అభిమానులని ఖుషి చేసాడు. ఇప్పుడు ఈ కోవలో మహేష్ బాబు (mahesh babu) కూడా చేరబోతున్నాడు.
ప్రముఖ హీరో సుధీర్ బాబు (sudheer babu)లేటెస్ట్ మూవీ హరోం హర (harom hara) షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని విడుదలకి సిద్ధం కాబోతుంది. ప్రెజంట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. రేపు ఈ మూవీ ట్రైలర్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా జరగబోతుంది. ఉదయం 11:25 గంటలకు మహేష్ బాబు లాంచ్ చేయనున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సుధీర్ సరసన మాళవిక శర్మ (Malvika Sharma) హీరోయిన్ గా చేస్తుండగా సునీల్, జయ ప్రకాష్, అక్షర, అర్జున్ గౌడ్, లక్కీ లక్ష్మణ్, రవి కాలే తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సుమంత్ జీ. నాయుడు నిర్మాతగా వ్యవహరిస్తుండగా జ్ఞాన సాగర్ ద్వారక (Gnanasagar Dwaraka)దర్శకత్వం వహిస్తున్నాడు. జూన్ 14 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

2012 లో వచ్చిన ఎస్ఎంఎస్ చిత్రం ద్వారా సుధీర్ బాబు తెలుగు సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యాడు. డాన్స్, ఫైట్స్, యాక్టింగ్ లో తిరుగులేదని అనిపించుకున్నాడు. కానీ కట్ అవుట్ కి తగ్గ హిట్ మాత్రం పడటం లేదు.ప్రేమ కథా చిత్రమ్ ఒక్కటే ఆయన కెరీర్ లో ఉన్న పెద్ద హిట్. ఇప్పటి వరకు సుమారు పద్దెనిమిది సినిమాల దాకా చేసాడు. ఇక సుధీర్ బాబు స్వయంగా మహేష్ కి బావ అనే విషయం అందరకి తెలిసిందే. మహేష్ చెల్లెలనే సుధీర్ పెళ్లి చేసుకున్నాడు. మరి ట్రైలర్ లాంచ్ చేస్తున్న మహేష్ ముందు ముందు హరోం హర కి తన వంతు ప్రమోట్ చెయ్యడం ఖాయం.
![]() |
![]() |