![]() |
![]() |

ఒకప్పుడు వంద కోట్ల బడ్జెట్ తో సినిమా రూపొందుతుందంటే గొప్పగా చెప్పుకునేవారు. అలాంటిది ఇప్పుడు హీరోల రెమ్యూనరేషనే వంద కోట్లకు పైగా ఉంటుంది. ఇప్పటికే ప్రభాస్ (Prabhas), అల్లు అర్జున్ (Allu Arjun) వంటి పాన్ ఇండియా హీరోలు వంద కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో మరో పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ (Ram Charan) చేరిపోయాడని తెలుస్తోంది.
'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న చరణ్.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' (Game Changer) సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా (RC 16) చేయనున్నాడు. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా భారీ బడ్జెట్ తో రూపొందనుంది. అయితే ఈ మూవీ కోసం రామ్ చరణ్ దిమ్మతిరిగే రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం. ఏకంగా రూ.125 కోట్ల రెమ్యూనరేషన్ చరణ్ తీసుకోబోతున్నాడని ఇన్ సైడ్ టాక్.
'ఆర్ఆర్ఆర్' చిత్రంతో రామ్ చరణ్ మార్కెట్ పెరిగింది. పైగా శంకర్ తో చేస్తున్న 'గేమ్ ఛేంజర్' కూడా పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటితే.. చరణ్ మార్కెట్ మరింత పెరిగే అవకాశముంది. అందుకే భారీ పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు ఏమాత్రం వెనకాడట్లేదు అంటున్నారు.
ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కేవలం చరణ్ పారితోషికమే రూ.125 కోట్లు అంటే.. భారీ తారాగణం, టాప్ టెక్నీషియన్స్ తో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం మొత్తం బడ్జెట్ ఎంత అవుతుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది.
![]() |
![]() |