![]() |
![]() |

రాముడు,హనుమంతుడు ఉన్న చోట జై శ్రీరామ్, జై హనుమాన్ అనుకున్న తర్వాతే పనులు మొదలుపెడతారు.అదే విధంగా నందమూరి బాలకృష్ణ ఉన్న చోట జై బాలయ్య అని మిగతా పనులు మొదలుపెడతారు.అలా చెప్పుకోవడం ఆనవాయితీ అని జబర్దస్త్ ద్వారా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపుని పొందిన హైపర్ అది చెప్తున్నాడు. బాలకృష్ణ గురించి ఇంకా చాలా చెప్పాడు.ఏం మాట్లాడాడో చూద్దాం
నిన్న విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (gangs of godavari సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ వేడుకకు బాలకృష్ణ (balakrishna)ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. డిజె టిల్లు ఫేమ్ నేహా శెట్టి (neha shetty) హీరోయిన్ గా చేస్తుండగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి కీలక పాత్రలో నటిస్తుంది. హైపర్ ఆది కూడా ఒక ఇంపార్టెంట్ క్యారక్టర్ ని పోషిస్తున్నాడు. ఈ సందర్భంగా హాజరయ్యిన హైపర్ అది జై బాలయ్య అంటు తన ప్రసంగాన్ని ప్రారంభించాడు.ఎన్టీఆర్ గారు తెలుగు జాతి గౌరవాన్ని కాపాడితే ఎన్టీఆర్ గారి గౌరవాన్ని బాలకృష్ణ గారు కాపాడుతున్నారు. సినిమాల్లోను, రాజకీయాల్లోను హుందాగా, నిజాయితీగా ఉంటు తండ్రి రుణం తీర్చుకుంటున్నారు. చాలా మంది బాలకృష్ణ గారు తిట్టారు కొట్టారు అని రాస్తు ఉంటారు. కానీ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కొన్ని వేల మంది పేద ప్రజల బతుకులు నిలబెట్టారు.బాలకృష్ణ గారితో సినిమా చేసే వాళ్ళకి భయం, బాధ్యత రెండు ఉంటాయి.అలా ఉంటేనే ఎవరైనా లైఫ్ లో ఎదుగుతారు.

బొబ్బిలి సింహం సినిమాలోని బాలకృష్ణ పంచె కట్టుడు అంటే నాకు చాలా ఇష్టం. పంచె కట్టులో రామారావు గారి తర్వాత అంత అందంగా ఉండే హీరో బాలకృష్ణ నే.అదే విధంగా మూడు దశాబ్దాలకి పైగా అన్ని జనరేషన్స్ సగర్వంగా చెప్పుకునేలా ఆదిత్య 369 , బైరవ ద్వీపం, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, సింహ, లెజండ్, అఖండ, భగవంత్ కేసరి సినిమాలు అందించారు. జనరేషన్ మారినా ,టెక్నాలజీ మారినా బాలకృష్ణ ఎనర్జీ లో మార్పు ఉండదు. స్టాక్ మార్కెట్ షేర్స్ అయినా పెరగడం తగ్గడం ఉంటాయి. కానీ బాలకృష్ణ ఇమేజ్ మాత్రం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు.ఇప్పుడు హైపర్ ఆది చెప్పిన ఈ మాటలన్నీ బాలకృష్ణ అభిమానుల్లో ఫుల్ జోష్ ని తెస్తున్నాయి. అదే విధంగా ఒక హీరోని అభిమానించినంత మాత్రాన ఇంకో హీరో మీద ఇష్టం లేకుండా పోదు. తెలుగు సినిమా ,తెలుగు హీరోలు నాకు చాలా ఇష్టం. రాబోయే రోజుల్లో నందమూరి సింహం, కొణిదల సింహం అసెంబ్లీ లో అడుగుపెట్టబోతున్నాయి అని కూడా చెప్పాడు. దీంతో పవన్ కళ్యాణ్ (pawan kalyan)ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి తో ఉన్నారు
![]() |
![]() |