![]() |
![]() |

ఈ భూమ్మీద పాట ఉన్నంత కాలం ఇళయరాజా( Ilaiyaraaja)పేరు వినపడుతూనే ఉంటుంది. బహుశా పాట కోసం చెవి కోసుకునే సామెత ఆయన్ని చూసే పుట్టిందేమో. నాలుగున్నర దశాబ్దాలుగా ఎన్నో అధ్బుతమైన గీతాలని అందిస్తు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. సంగీత ప్రేమికుల ఇష్ట దైవం కూడాను. అంతటి సంగీత శిఖరంపై ఇప్పుడు వ్యతిరేకత మొదలయ్యింది
నా సంగీతంలో వచ్చిన పాటని ఎవరు వాడుకోవడానికి లేదు.ఇది ఇళయరాజా రాజ వ్యాఖ్య. ఒక వేళ వాడుకుంటే తన అనుమతి తప్పని సరి. లేని పక్షంలో కోర్టులో కేసు వేస్తాడు. అప్పటికి నష్ట పరిహారం చెల్లించక పోతే లీగల్ గా ఎంత దూరమైన వెళ్తాడు. చాలా సార్లు ఈ విషయంలో ఆయనకి ప్రజలనుంచి మద్దతు లభించింది. కానీ ఎప్పుడైతే మంజుమ్మేల్ బాయ్స్ (Manjummel Boys) టీం కి నోటీసులు పంపించాడో వ్యతిరేకత మొదలయింది. మంజుమ్మేల్ బాయ్స్ క్లైమాక్స్ లో గుణ సినిమాలోని కమ్మని నీ ప్రేమ లేకనే రాసింది హృదయమే అనే పాట ప్లే అవుతుంది. ఈ పాట కి స్వరకర్త ఇళయరాజానే. తన అనుమతి లేదని మంజుమ్మేల్ టీం కి కోర్టు నోటీసులు పంపించాడు. దీంతో చాలా మంది మంజుమ్మేల్ బాయ్స్ మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. పైగా మీ పాట ఆ సమయంలో వాడుకోవడం తప్పని సరి. కాబట్టి మంజుమ్మేల్ ని వదిలెయ్యండి అంటున్నారు

మరి మొదటి నుంచి మొండి పట్టుదలకు మారుపేరైన ఇళయరాజా వెనక్కి తగ్గుతాడా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డు వదలని చాలా స్పష్టంగా చెప్తుంది. అమరగాయకుడు ఎస్ పి బాలసుబ్రమణ్యం(s.p balasubramanyam)ఇళయరాజా ల మధ్య స్నేహం నాలుగు దశాబ్దాలు. పైగా ఏకవచనం తో పిలుచుకునే స్వతంత్రం కూడా ఉంది. అలాంటి బాలు గారే తన పాట పాడితే కేసు పెట్టాడు.తన అనుమతి లేనిదే పాడటానికి వీల్లేదని ఖరాకండిగా చెప్పాడు. కాగా ఇటీవలే చెన్నై లో ఇళయరాజా సంగీత పరిశోధన కేంద్రం ఏర్పాటయింది. సంగీత రంగంలో ఆయన సృష్టించిన ప్రభంజనానికి అది నిదర్శనం
![]() |
![]() |