![]() |
![]() |
.webp)
అజయ్ దేవగణ్ హీరోగా రూపొందిన ఫుట్‌బాల్ కోచ్ రహీమ్ బయోపిక్ 'మైదాన్' ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.
రహీమ్ సాబ్... భారత ఫుట్ బాల్ టీమ్ కోచ్. ఏషియన్ గేమ్స్‌లో దేశానికి గోల్డ్ మెడల్స్ తెచ్చిన ఘనత ఆయన సొంతం. ఆయన మరణం తర్వాత మేజర్ టోర్నమెంట్లలో మన ఫుట్ బాల్ జట్టు ఒక్క మెడల్ కూడా సాధించలేదు. హైదరాబాద్‌కు చెందిన ఆయన జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ 'మైదాన్'. ఎస్ఎ రహీమ్ పాత్రలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, రహీమ్ భార్య పాత్రలో ప్రియమణి నటించారు. జీ స్టూడియోస్ సంస్థతో కలిసి బోనీ కపూర్ ఈ సినిమాని నిర్మించారు. స్పోర్ట్స్ బయోపిక్ అంటే పాపులర్, సక్సెస్‌ఫుల్ పర్సన్స్ జీవితాలే. ప్రతీ సోర్ట్స్ పర్సన్ జీవితంలో ఎవరో ఒకరు అవరోధాలు, ఆటంకాలు సృష్టించడం, చివరకు విజేతగా నిలవడం ఇది కామన్ గా సాగుతుంది. తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది.
1952లో జరిగిన ఒలంపిక్స్ లో భారత ఫుట్ బాల్ జట్టు యుగోస్లేవియా చేతిలో ఓడిపోతుంది. ఆ మ్యాచ్ లో ప్రత్యర్థి జట్టు ఏకంగా పది గోల్స్ చేస్తుంది. ఇక మ్యాచ్ ఓడిపోవడంతో అన్ని దినపత్రికలలో సయ్యద్ అబ్దుల్ రహీమ్ కోచ్ ని దూషిస్తూ వార్తొలొచ్చాయి. ఓటమి నుండి పాఠాలు నేర్చుకొని మళ్ళీ భారత ఫుట్ బాల్ జట్టును సయ్యద్ ఎలా ప్రిపేర్ చేశాడు? ఆ తర్వాత జరిగిన టోర్నీలో భారత జట్టు గెలిచిందా లేదా అనేది కథ.. క్రికెట్ అంటే 'ఎమ్.ఎస్ ధోని' మూవీ, హాకీ అంటే చక్ దే ఇండియా' అని ఎలా అంటామో.. ఇప్పుడు ఫుట్ బాల్ అంటే 'మైదాన్' అని చెప్పేయొచ్చు. తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీని ఓసారి చూసేయ్యండి.
![]() |
![]() |