![]() |
![]() |

శర్వానంద్(Sharwanand), కృతి శెట్టి(Krithi Shetty) జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మనమే'(Manamey). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
విడుదల తేదీని కనీసం నెలరోజుల ముందైనా ప్రకటించి.. తమ మూవీని బాగా ప్రమోట్ చేసుకోవాలని చూస్తారు మేకర్స్. కానీ 'మనమే' టీం మాత్రం.. 'మా రూటే సెపెరేట్' అంటుంది. ఏప్రిల్ లో 'మనమే' టీజర్ ని విడుదల చేసిన సమయంలో.. సినిమాని వేసవిలో రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. కానీ, మే నెల చివరికి వచ్చింది. వేసవి కూడా అయిపోవచ్చింది. అయినా 'మనమే' రిలీజ్ పై క్లారిటీ లేదు. అయితే తాజాగా మేకర్స్ ఉన్నట్టుండి రిలీజ్ డేట్ గురించి అప్డేట్ ఇచ్చారు.
'మనమే' విడుదల తేదీని ఈరోజు సాయంత్రం రివీల్ చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. అయితే జూన్ 7న సినిమాని విడుదల చేయాలని వారు నిర్ణయించినట్లు సమాచారం. ఓ రకంగా ఇది షాకింగ్ డెసిషన్ అనే చెప్పాలి. ఎందుకంటే విడుదల తేదికి ఇంకా రెండు వారాల సమయం కూడా లేదు. ఇంత తక్కువ సమయంలో సినిమాని ప్రమోట్ చేసి, జనాల్లోకి తీసుకెళ్లి, వారిని థియేటర్లకు వచ్చేలా చేయడం అంత తేలికైన విషయం కాదు.
అసలే ప్రస్తుతం థియేటర్లలో సినిమాల ఆదరణ అంతంతమాత్రం ఉంది. ఎన్నికలు, ఓటీటీల ప్రభావం థియేటర్లపై బాగా పడింది. ఎన్నో సినిమాలు వాయిదా పడ్డాయి. ఇలాంటి సమయంలో ప్రమోషన్స్ కి తగినంత సమయం లేకుండా.. సడెన్ గా 'మనమే' చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓ రకంగా ఇది రిస్క్ అనే చెప్పాలి. మరి ఈ ప్రతికూలతలను దాటుకొని.. 'మనమే' ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
![]() |
![]() |