![]() |
![]() |

అదుర్స్ సినిమాలో బ్రహ్మానందం ని ఉద్దేశించి ఎన్టీఆర్ ఒక డైలాగ్ చెప్తాడు. పగోడికి కూడా మీ కష్టం రాకూడదు గురువుగారు అని. ఇప్పుడు ఈ డైలాగ్ ప్రముఖ సినీ నటి హేమ (hema) పరిస్థితికి పర్ఫెక్ట్ గా సూటవుతుంది.తన మానాన తాను హైదరాబాద్ లో బిర్యానీ చేసి అభిమానులు కూడా అలా తయారు చేసుకొని సుష్టిగా తినాలని మేకింగ్ వీడియోని ఇనిస్టాగ్రమ్ లో అప్ లోడ్ చేస్తే పాడు లోకం నువ్వు హైదరాబాద్ లో చెయ్యలేదని అంటుంది. పైగా ప్రూఫ్స్ తో సహా బయటపెడుతుంది.
బెంగళూర్ లో ఇటీవల ఒక వ్యాపారవేత్తకు చెందిన ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ జరిగింది. అందులో డ్రగ్స్ వాడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి పలువురిని అరెస్ట్ చేసారు.వారిలో తెలుగు రాష్టాలకి చెందిన సెలబ్రెటీలు ఉన్నారంటూ కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి. పైగా సినీ సెలబ్రెటీలు కూడా ఉండటంతో అందరు ఈ కేసు వైపే చూస్తున్నారు.వాళ్ళల్లో హేమ కూడా ఉందనే వార్తలు వచ్చాయి. కానీ రేవ్ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదు. రెండు రోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ హేమ ఒక వీడియో రిలీజ్ చేసింది.ఆ వీడియో చూసిన వాళ్లంతా నిజమే అని అనుకున్నారు. కానీ ఆ వీడియో కూడా వైరల్ అయ్యి కూర్చుంది.ఎందుకంటే ఆ పార్టీలో నటి హేమ ఉంది. పైగా హేమ మాట్లాడిన వీడియో బెంగళూరు ఫామ్‌హౌస్‌లోనే షూట్ చేసింది. ఈ విషయాన్నీ కర్ణాటక పోలీసులు చెప్పడంతో అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో తెలుగు ప్రజలు ఫుల్ కన్ఫ్యూజ్ లో ఉంటే హేమ తాజాగా ఇంకో వీడియో రిలీజ్ చేసింది. చికెన్ ధమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్ లోడ్ చేసింది.దాంతో నెటిజన్లు చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో ఉండి హైదరాబాద్‌లో ఉన్నట్లుగా వీడియో రిలీజ్ చేస్తావా.. ఏం ఐడియా మేడమ్, భలే కవర్ చేశారు అంటూ ఏకిపారేస్తున్నారు.పైగా ఆ వీడియో ఇప్పటిది కాదు అని పక్కాగా చెప్తున్నారు
ఈ మధ్య కాలంలో ఇన్‌స్టాలో హేమ వీడియోలు ఏమీ పోస్ట్ చేయలేదు. చివరి అప్‌డేట్ ఏప్రిల్ 26న ఉంది. దీంతో ఇప్పుడు సడెన్‌గా ఇలా బిర్యానీ చేసే వీడియో పోస్ట్ చేయడంతో నెటిజన్లు లా పాయింట్లు లాగుతున్నారు.బెంగుళూర్ క్రైమ్ విభాగం అడిషనల్ కమిషనర్ చంద్రగుప్త ఆధ్వర్యంలో కేసు నడుస్తుంది. ముందు ముందు ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఎవరి పేర్లు బయటకి వస్తాయో చూడాలి
![]() |
![]() |