![]() |
![]() |

కొన్నేళ్లు నటనకు బ్రేక్ ఇచ్చిన మంచు మనోజ్ (Manchu Manoj).. 'మిరాయ్' సినిమాలో విలన్ గా నటిస్తూ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మనోజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కరెక్ట్ టైంలో, కరెక్ట్ రోల్ తో మనోజ్ రీ ఎంట్రీ ఇస్తున్నాడని.. భారీ సినిమాలలో కీ రోల్స్ కి కూడా బెస్ట్ ఛాయిస్ అవుతాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మనోజ్ సైతం.. తాను హీరోగానే నటించాలనే రూల్ పెట్టుకోకుండా.. ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా ఇతరుల సినిమాల్లో కీలక పాత్రలు పోషించడానికి రెడీ అవుతున్నట్లు అర్థమవుతోంది. ఈ మేరకు 'మిరాయ్'తో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మనోజ్ నటించనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది.
మే 20న మనోజ్ పుట్టినరోజు సందర్భంగా అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పాడు. ఆ ట్వీట్ కి మనోజ్ ఇచ్చిన రిప్లై హాట్ టాపిక్ గా మారింది. "థాంక్యూ సో మచ్ బ్రదర్.. మన కాంబోతో దుమ్ముదులిపేద్దాం త్వరలో" అని రిప్లై ఇచ్చాడు మనోజ్. దాంతో మనోజ్-అనిల్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందని విషయం అర్థమైపోయింది. అయితే అనిల్ దర్శకత్వంలో మనోజ్ హీరోగా చేయనున్నాడా? లేక వేరే హీరో సినిమాలో కీలక పాత్ర పోషించనున్నాడా? అనేది సస్పెన్స్ లా మారింది.

రావిపూడి తన తదుపరి చిత్రాన్ని వెంకటేష్ తో చేయనున్న సంగతి తెలిసిందే. 'ఎఫ్ 2', 'ఎఫ్ 3' తరువాత వీరి కాంబోలో వస్తున్న మూడో చిత్రమిది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ట్రయాంగులర్ క్రైమ్ ఎంటర్టైనర్ లో మనోజ్ నటించే అవకాశముందని సమాచారం. అదే నిజమైతే ఈ ప్రాజెక్ట్ మరింత క్రేజీగా మారుతుంది అనడంలో సందేహం లేదు. మొత్తానికి మనోజ్ జోరు చూస్తుంటే.. రీ ఎంట్రీలో గట్టిగానే అదరగొట్టేలా ఉన్నాడు.
![]() |
![]() |