![]() |
![]() |
మే 20 యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అనే విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం నుంచే సినీ, రాజకీయ ప్రముఖులు, నెటిజన్లు, యంగ్ టైగర్ అభిమానులు ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం ట్విట్టర్ ద్వారా తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కాంక్షిస్తూ ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ దానికి రిప్లయ్ ఇస్తూ ‘మీరు శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు.
![]() |
![]() |