![]() |
![]() |

సినిమాని విపరీతంగా ప్రేమించే వాళ్ళల్లో భారతీయులు ముందు వరుసలో ఉంటారు. అందులోను హీరోయిన్లని దేవ కన్యల్లా భావిస్తారు. వాళ్ళు కనపడితే చాలు తమ జన్మ ధన్యం అయినట్టుగా ఫీలవుతారు. కుర్రకారు అయితే తమ కళల రాణిగా కూడా భావిస్తారు. అలాంటిది హీరోయిన్ ఏకంగా తన ముందు ఉంటే ఒక యువకుడు మాత్రం అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది.
ప్రముఖ హీరోయిన్ తాప్సీ పొన్ను (taapsee pannu) గురించి తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు ఉండడు. సోషల్ మీడియా యుగం కాబట్టి నూటికి నూరుపాళ్లు తెలియని ఛాన్సే లేదు. 2010 లో సినీ రంగ ప్రవేశం చేసి లేటెస్ట్ గా షారుక్ తో డంకీ మూవీ కూడా చేసింది. సో తెలియని ఛాన్సే లేదు. కానీ ముంబై లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. స్విగ్గి (swiggy) కంపెనీ కి చెందిన ఒక డెలివరీ బాయ్ ముంబై లోని ఒక అపార్ట్మెంట్ లోకి డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాడు.ఆ సమయంలో తాప్సీ సదరు యువకుడు ముందు నుంచే వెళ్తుంది. కానీ అతను తాప్సీ ని చూడలేదు. ఒక వేళ అతను చూసి ఉండడేమో అనుకుంటే పొరపాటే. చాలా దగ్గరగానే వెళ్ళింది. కానీ అతను పట్టించుకోకుండా వెళ్ళాడు. మరి ఈ వీడియో ఎలా బయటకి వచ్చిందో గాని ఫుల్ వైరల్ గా మారింది

ఇక ఈ విషయం మీద సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కంగారులో చూడలేదేమో అని కొంత మంది అంటుంటే మరి కొంత మంది మాత్రం హీరోయిన్ ఐతే నాకేంటి ఇక్కడ ఉంది స్విగ్గి బాయ్ అనే రీతిలో పట్టించుకోలేదని అంటున్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజం. అతను నిజంగానే పట్టించుకోలేదంటే పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు కలికాలానికి ముహూర్తం దగ్గర పడినట్టే. మరి తాప్సీ అతన్ని పట్టించుకుందా ఒక వేళ పట్టించుకోని ఉంటే ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉందో
![]() |
![]() |